Begin typing your search above and press return to search.

గామి రిలీజ్ డేట్.. ఆ స్పెషల్ డేట్ కే..

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రతి సినిమాతో ప్రేక్షకులను కొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   7 Feb 2024 6:02 PM GMT
గామి రిలీజ్ డేట్.. ఆ స్పెషల్ డేట్ కే..
X

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రతి సినిమాతో ప్రేక్షకులను కొత్తగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి మూవీ చేసినా అందులో తన పాత్ర నెవ్వర్ బిఫోర్ లా ఉండేలా చూసుకుంటున్నారు మాస్ కా దాస్. ఇప్పటి వరకు ఎక్కువగా మాస్ రోల్స్ చేస్తూ వచ్చిన ఆయన.. ఈ సారి మాత్రం కొత్తదనం కోసం ట్రై చేసినట్టుగా కనిపిస్తోంది. అందుకు నిదర్శనమే ఆయన కొత్త మూవీ గామి.


ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోర శంకర్ గా కనిపించనున్నారు. ఆయన పాత్ర పూర్తి భిన్నంగా తెరపై కనిపించనుంది. తన బాడీ లాంగ్వేజ్ కు దూరంగా.. తన ఇమేజ్ కు భిన్నమైన పాత్రను ఆయన పోషించడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాతో విద్యాధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కీలకమైన పాత్రలో హీరో చాందినీ చౌదరి కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఒక మనిషి తన భయాన్ని జయించడానికి చేసే అసాధ్యమైన, తెలియని ప్రయాణం అంటూ విశ్వక్‌ సేన్‌, చాందినీ చౌదరి మంచు కొండల్లో అన్వేషణలో ఉన్న లుక్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

అయితే విశ్వక్ సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మార్చి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ఆ మూవీ మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. కానీ ఇంకా ఈ సినిమా మ్యూజిక్ వర్క్ కాస్త పెండింగ్ ఉందట. అందుకే ఈ సినిమాను ఏప్రిల్ లో సోలోగా రిలీజ్ చేయనున్నారట. ఇప్పుడు అదే డేట్ లో గామి రిలీజ్ అవుతోంది. అయితే ఈ మూవీ నాలుగేళ్లుగా షూటింగ్ జరుపుకుంటోంది.

మరోవైపు, మూవీ యూనిట్.. గామి సినిమా మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. గామి కోసం భారీ సెట్స్ వేయడం మాత్రమే కాకుండా.. సముద్ర మట్టానికి 19 వేల అడుగుల ఎత్తులో, గడ్డకట్టించే -40 డిగ్రీల చలిలో సినిమా షూటింగ్ చేశారు. ఈ మేకింగ్ వీడియో చూసిన తర్వాత టీం కష్టం తెలియడమే కాకుండా.. ఫ్యాన్స్ లో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ఎంజీ అభినయ, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్‌ సమర్పణలో కార్తీక్ శబరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.