Begin typing your search above and press return to search.

గామి సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉండబోతోందంటే..

అసలు మొదట ట్రైలర్ చూసినప్పుడు A సర్టిఫికెట్ వస్తుంది అని ఎవరు ఊహించలేదు. కానీ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   7 March 2024 7:09 AM GMT
గామి సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉండబోతోందంటే..
X

టాలెంటెడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విద్యాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన గామి ఆ తర్వాత టీజర్ ట్రైలర్ తో మరింత ఎక్కువ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకుంది. ప్రమోషనల్ కంటెంట్ తోనే ఈ సినిమా జనాల దృష్టిని ఆకర్షించింది.

తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే విధంగా ప్రమోషన్స్ అయితే చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ఇటీవల ఫినిష్ అయిన విషయం తెలిసిందే. సినిమాలో కొన్ని లోతైన సన్నివేశాలను ఎంతో అర్థవంతంగా ప్రజెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చింది.

అసలు మొదట ట్రైలర్ చూసినప్పుడు A సర్టిఫికెట్ వస్తుంది అని ఎవరు ఊహించలేదు. కానీ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే దీనికి ఏ సర్టిఫికెట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా 2 గంటల 26 నిమిషాలు నిడివి తో వెండితెరపై కొనసాగబోతుంది. ఫస్ట్ ఆఫ్ లోనే స్క్రీన్ ప్లే తో దర్శకుడు చాలా ఆకట్టుకునే విధంగా సన్నివేశాలను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక సెకండ్ హాఫ్ పై మరింత అంచనాలను పెంచే విధంగా ఆ సీన్స్ ఉంటాయట. విశ్వక్ సేన్ ఈ సినిమాలో అఘోరా పాత్రలో కనిపించనున్నాడు. మానవ స్పర్శ తగిలితేనే తట్టుకోలేని అతను ఆ సమస్య నుంచి బయటపడడానికి హిమాలయాలకు ప్రయాణం సాగిస్తాడు. అతనితో పాటు హీరోయిన్ చాందిని చౌదరి కూడా వెళుతుంది. ఈ క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అతనికి చివరికి ఎలాంటి సమాధానం దొరికింది అనే అంశాలు సినిమాలో చాలా ఆలోచింపజేసే విధంగా ఉండబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా విజువల్స్ కూడా హైలెట్ కాబోత్బున్నాయి.

మొత్తానికి సినిమా కంటెంట్ మాత్రం బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది అని అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలోని నటీనటులు కూడా వారి పాత్రలకు తగ్గట్టుగా క్యారెక్టర్స్ లో ఒదిగిపోయినటించారని చెబుతున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునే విధంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చేలా కనిపిస్తున్నాయి. మరి మొత్తంగా మొదటి రోజు సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.