Begin typing your search above and press return to search.

గామి బాక్సాఫీస్.. విశ్వక్ సాలిడ్ ఓపెనింగ్స్

ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించగా.. అభినయ లీడ్ రోల్ పోషించింది.

By:  Tupaki Desk   |   9 March 2024 7:30 AM GMT
గామి బాక్సాఫీస్.. విశ్వక్ సాలిడ్ ఓపెనింగ్స్
X

గామితో శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మాస్ కా దాస్, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ గా దూసుకెళ్తున్న విశ్వక్.. అఘోర శంకర్ పాత్రలో తన నటనతో అదరగొట్టారు. మానవ స్పర్శ తట్టుకోలేని పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించగా.. అభినయ లీడ్ రోల్ పోషించింది.


విద్యాధర కాగిత దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వరల్డ్ వైడ్ గా మార్చి 8వ తేదీన రిలీజ్ చేసింది. అయితే నాలుగేళ్లకుపైగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ.. విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొల్పింది. అలానే సినిమా కూడా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో తెగ ఆకట్టుకుంటోంది.

అయితే ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.9.07 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. మొత్తానికి ఫస్ట్ డే ఈ మూవీ అదిరిపోయే కలెక్షన్లు వసూలు చేసింది. ఇక అమెరికాలో 250K డాలర్స్ పైగా కలెక్ట్ చేసి 1 మిలియన్ డాలర్ మార్క్ దిశగా దూసుకుపోతోంది. విశ్వక్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది గామి.

వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ క్రౌడ్ ఫండింగ్ తో గామి చిత్రాన్ని నిర్మించారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషన్స్, వీఎఫ్ ఎక్స్, ఇతర ఖర్చులతో కలపి ఈ మూవీ బడ్జెట్ రూ.24 కోట్లు అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

గామి సినిమాకు సంబంధించిన నైజాం రైట్స్ రూ.3.5 కోట్లు, సీడెడ్ రూ.1.4 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.3.5 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఓవర్సీస్ తో కలిపి ఓవరాల్ గా ఈ సినిమాకు రూ.11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఫస్ట్ డే మంచి వసూళ్లు రాబట్టడంతో త్వరలోనే ఈ మూవీ హిట్ టాక్ అందుకోనుంది. మరి ఈ సినిమా ఎలాంటి లాభాలు కురిపిస్తుందో చూడాలి.