Begin typing your search above and press return to search.

అడ్వాన్స్ బుకింగ్స్.. గామి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ పక్కా..

విశ్వక్ షేక్, చాందిని చౌదరి కాంబినేషన్ లో విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గామి

By:  Tupaki Desk   |   7 March 2024 4:43 AM GMT
అడ్వాన్స్ బుకింగ్స్.. గామి స్ట్రాంగ్ ఓపెనింగ్స్ పక్కా..
X

విశ్వక్ షేక్, చాందిని చౌదరి కాంబినేషన్ లో విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గామి. ఈ సినిమా మార్చి8న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ట్రైలర్ తోనే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ ఉంది. విశ్వక్ సేన్ కెరియర్ లో చేస్తోన్న విభిన్నమైన పాత్ర కావడంతో కచ్చితంగా కొత్తగా ఉంటుందనే ఆసక్తి నెలకొని ఉంది. ప్రస్తుతం నేటితరం యువ హీరోలలో మంచి హైప్ ఉన్న స్టార్స్ లలో విశ్వక్ సేన్ టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు.

అతని నుంచి మూవీ వస్తుందంటేనే కచ్చితంగా ఏదో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తూ ఉంటారు. అతని సినిమాలకి మంచి ఓపెనింగ్స్ కూడా వస్తూ ఉంటాయి. చివరిగా విశ్వక్ సేన్ దాస్ కా దమ్కీ మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది గామి మూవీతో థియేటర్స్ లోకి రాబోతున్నాడు.

ఈ మూవీ ట్రైలర్ తో వచ్చిన పాజిటివ్ బజ్ కారణంగా ఇప్పటికే మల్టీప్లెక్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. బి,సి సెంటర్స్ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. విశ్వక్ సేన్ కెరియర్ లో మొదటి సారి భారీ అంచనాలతో ముందుగానే అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ సొంతం చేసుకుంటున్న మూవీ గామి అని చెప్పొచ్చు.

సెన్సార్ టీం ఏ సర్టిఫికేట్ జారీ చేసిన కూడా వారి నుంచి మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిందంట. కచ్చితంగా విశ్వక్ సేన్ కెరియర్ లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా గామి ఉంటుందనే అభిప్రాయం సినీ విశ్లేషకుల నుంచి సైతం వ్యక్తం అవుతోంది. కొత్త దర్శకుడు విద్యాధర్ మూవీపై బజ్ క్రియేట్ చేయడంలో, అలాగే ఎవ్వరూ టచ్ చేయని సరికొత్త కథని నేరేట్ చేయడంలో ట్రైలర్ తోనే సక్సెస్ అయ్యాడు.

ఈ సక్సెస్ సినిమాకి కూడా కంటిన్యూ అవుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. విశ్వక్ సేన్ కూడా గామి సినిమా సక్సెస్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మూవీకి హిట్ టాక్ వస్తే మాత్రం భవిష్యత్తులో ఎలాంటి మరిన్ని కథలు సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి యంగ్ హీరోలు ధైర్యం చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.