Begin typing your search above and press return to search.

భ‌విష్య‌త్ పాన్ ఇండియా మ‌న న‌ట‌వార‌సుల‌దే!

అందువ‌ల్ల ...పాన్ ఇండియాలో ఏల్తున్న‌ టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్ వార‌సుడు - అల్లు అయాన్ , మ‌హేష్ వార‌సుడు గౌత‌మ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ వార‌సుడు - అకీరా, ప్ర‌య‌త్నిస్తే వీళ్ల‌కు పాన్ ఇండియాలో అవ‌కాశాలున్నాయి.

By:  Tupaki Desk   |   31 March 2024 1:30 PM GMT
భ‌విష్య‌త్ పాన్ ఇండియా మ‌న న‌ట‌వార‌సుల‌దే!
X

ప్ర‌స్తుతం టాలీవుడ్ నుంచి న‌లుగురు స్టార్ హీరోలు పాన్ ఇండియాలో ఏల్తున్నారు. ప్ర‌భాస్, అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పేర్లు స్ట్రాంగ్ గా రిజిస్ట‌ర్ అయ్యాయి. రాజ‌మౌళితో మ‌హేష్ సినిమా రిలీజైతే, అత‌డు కూడా ఈ జాబితాలో చేరిపోతాడు. సీనియ‌ర్ హీరోలు అలాగే యువ‌హీరోలు ఇటీవ‌ల పాన్ ఇండియా స్టార్ డ‌మ్ పై దృష్టి పెట్టారు. అందువ‌ల్ల వీళ్ల‌లో కొంద‌రి పేర్లు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకునే ఛాన్సుంది. నిఖిల్, అడివి శేష్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ లాంటి యువ‌ హీరోలు పాన్ ఇండియాలో సుప‌రిచితుల‌య్యారు.

అయితే భ‌విష్య‌త్ లో పాన్ ఇండియాను ఏలేది ఎవ‌రు? ఈ జ‌న‌రేష‌న్ స్టార్లు కాకుండా, వారి వార‌సుల నుంచి ఎవ‌రెవ‌రు స్టార్లు అవుతారు? న‌ట‌వార‌సుల్లో ఎవ‌రెవ‌రికి పాన్ ఇండియా స్టార్ డ‌మ్ చిక్కుతుంది? అనేదానిపై ఊహాజ‌నిత క‌థ‌న‌మిది.

నిజానికి బాలీవుడ్ లో కీల‌క హీరోలైన ఖాన్ ల త్ర‌యానికి స‌రైన వార‌సులే లేరు... స‌ల్మాన్ ఖాన్‌కి పెళ్ల‌వ‌లేదు షారూఖ్ కి ఆర్య‌న్ ఖాన్ ఉన్నా కానీ, అత‌డు న‌టించేట్టు లేడు. డైరెక్ట‌ర్ అవుతానంటున్నాడు. అమీర్ ఖాన్ వార‌సుడు జునైద్ ఖాన్ ఉన్నా కానీ, తండ్రిలో ఉన్నంత ఛ‌రిష్మా క‌నిపించ‌డం లేదు. అమీర్ వార‌సుడు న‌టిస్తున్నా అంతగా క్రేజ్ లేదు.

ఉత్త‌రాది కీల‌క హీరోల వార‌సులు ప్ర‌స్తుతానికి జీరో. అందువ‌ల్ల ...పాన్ ఇండియాలో ఏల్తున్న‌ టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్ వార‌సుడు - అల్లు అయాన్ , మ‌హేష్ వార‌సుడు గౌత‌మ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ వార‌సుడు - అకీరా, ప్ర‌య‌త్నిస్తే వీళ్ల‌కు పాన్ ఇండియాలో అవ‌కాశాలున్నాయి. భ‌విష్య‌త్ అంతా పాన్ ఇండియానే కాబ‌ట్టి న‌ట‌వార‌సుల‌కు ఛాన్స్ ఉంది.. తెలుగు అగ్ర హీరోల‌ వార‌సులంతా రెడీ అయ్యేప్ప‌టికి టాలీవుడ్ రేంజు హాలీవుడ్ స్థాయి ప్ర‌మాణాల‌లో మెరుగైన స్థితికి చేరుకుంటుందని అంచ‌నా. ఇటీవ‌ల మ‌న స్టార్లు ఎందులోను త‌గ్గ‌డం లేదు. కార్పొరెట్ కంపెనీలు బిగ్ బ‌డ్జెట్ల‌తో ముందుకు వ‌స్తుంటే ప్ర‌యోగాల‌తో అద‌ర‌గొడుతున్నారు. సాంకేతికంగాను అత్యుత్త‌మ ప్ర‌మాణాల‌కు ఇప్పుడిప్పుడే అల‌వాటు ప‌డ్డారు.

ఇక‌పోతే బాలీవుడ్ నుంచి ఎవ‌రూ పాన్ ఇండియా న‌ట‌వార‌సులు లేరా? మునుముందు దూసుకొచ్చేందుకు అవ‌కాశం లేదా? అన్న‌ది విశ్లేషిస్తే.. స్టార్ హీరో హృతిక్ రోష‌న్ మాజీ భార్య సుసానేకు జ‌న్మించిన వార‌సులు హీరో అయ్యేందుకు ఆస్కారం ఉంది. అమితాబ్ కుటుంబం నుంచి - శ్వేతానంద‌న్ వార‌సుడు అగ‌స్త్య నందా ఛ‌రిష్మాటిక్ హీరో అయ్యే ఛాన్సుంది. అత‌డు 'ది ఆర్చీస్'తో తెర‌కు ప‌రిచమయ్యాడు. స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు ఆర్భాజ్ - మ‌లైకా జంట కుమారుడు అర్హ‌న్ ఖాన్ అంద‌గాడు.. వార‌సుడిని న‌టుడిని చేయాల‌ని మ‌లైకా ప్ర‌య‌త్నిస్తోంది. డియోల్ ఫ్యామిలీలో స‌న్నీడియోల్, బాబీ డియోల్ వార‌సులు న‌టుల‌య్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. క‌పూర్ ఫ్యామిలీలో బోనీ, అనీల్ క‌పూర్ ల‌కు న‌టుడ‌య్యే వాళ్లు లేరు.. కుటుంబంలో అంద‌రూ అమ్మాయిలే ఉన్నారు. వీళ్ల‌లో అంద‌గ‌త్తెలంతా క‌థానాయిక‌లుగాను సుప‌రిచితులు.

ఇంకా బాలీవుడ్ లో ఎవ‌రెవ‌రు ఉన్నారు? అంటే స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కి ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ ఉంది. తెలుగు, త‌మిళంలో స‌హాయ‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. అదే క్ర‌మంలో సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్ర‌హీం అలీఖాన్ స్టార్ గా దూసుకుపోయే ఛాన్సుంది. అత‌డికి పాన్ ఇండియా మార్కెట్ చిక్కేందుకు ఛాన్సుంది. ఆ త‌ర్వాత ఇబ్ర‌హీం సోద‌రులు కూడా ప‌రిశ్ర‌మ‌లో ప్రవేశించే వీలుంది. వీళ్ల‌తో పాటు షారూఖ్ ఖాన్ కి జ‌న్మించిన సరోగ‌సి కిడ్స్ కూడా భార‌త‌దేశంలో భ‌విష్య‌త్ స్టార్లు అయ్యేందుకు ఆస్కారం ఉంది. (ఇది కేవ‌లం ఊహాజ‌నిత‌మైన క‌థ‌నం.. ఎవ‌రి భ‌విష్య‌త్ ఎలా ఉంటుందో ఊహాగానాల వ‌ర‌కే. అంతా ఆ పైవాడికే ఎరుక‌)