Begin typing your search above and press return to search.

ఫంకీ గురి తప్పదంతే..?

విశ్వక్ సేన్ అనుదీప్ కెవి కాంబినేషన్ లో ఫంకీ సినిమా వస్తుంది. ఈ సినిమాలో డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది.

By:  Tupaki Desk   |   27 July 2025 4:00 AM IST
ఫంకీ గురి తప్పదంతే..?
X

విశ్వక్ సేన్ అనుదీప్ కెవి కాంబినేషన్ లో ఫంకీ సినిమా వస్తుంది. ఈ సినిమాలో డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా తీశాక అనుదీప్ చేస్తున్న సినిమా ఇది. జతిరత్నాలు సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న అనుదీప్ ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. ఆ సినిమా తెలుగులో మంచి ప్రేక్షకాదరణ పొందింది కానీ తమిళ్ లో పెద్దగా ఆడలేదు.

ఐతే ఇప్పటికీ ఆ సినిమాలో సీన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. అనుదీప్ డైరెక్షన్, అతని కామెడీ పంచులు, సీన్ రైటింగ్ అంతా కూడా ఏదో ప్లానింగ్ తో రాసుకున్నట్టు కాదు అలా ఫ్లోలో వచ్చినట్టుగానే ఉంటాయి. ముందు క్యారెక్టరైజేషన్స్ రాసుకుని వాళ్లకు తగిన డైలాగ్స్ ని తూకం కొలిచినట్టు రాస్తుంటాడు. అందుకే ఎవరికి పడాల్సిన డైలాగ్స్ వాళ్లకు పడతాయి.. ఆడియన్స్ కు నవ్వులు తెప్పిస్తాయి.

ప్రస్తుతం విశ్వక్ సేన్ తో చేస్తున్న ఫంకీ సినిమా కూడా అనుదీప్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందట. ఐతే ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఫ్యాన్స్ కి కూడా కావాల్సిన అంశాలు పొందుపరుస్తున్నట్టు తెలుస్తుంది. విశ్వక్ సేన్ ఈమధ్య వరుస ఫ్లాపులతో కాస్త కెరీర్ డిస్ట్రబ్ గా ఉన్నాడు. ఎలాగైనా ఒక సాలిడ్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఐతే అనుదీప్ సినిమాతో విశ్వక్ సేన్ కోరుకునే హిట్ దొరుకుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

జాతిరత్నాలు సినిమాతోనే దాదాపు 90 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టాడు అనుదీప్. విశ్వక్ సేన్ మాస్ ఇమేజ్ తో అతని డైరెక్షన్ లో కచితంగా గురి తప్పకుండా ఫంకీ తీస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్, కయదు జోడీ కూడా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. అసలే యూత్ ఆడియన్స్ కి కయదు డ్రీం గర్ల్ గా మారింది. సో ఆమెతో విశ్వక్ చేసే రొమాన్స్ కూడా ఫంకీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఫంకీ షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది అన్నది ఇంకా బయటకు రాలేదు. సినిమా మొత్తం పూర్తి చేసి ఇక ప్రమోషన్స్ వంతు చూడాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు. మరి విశ్వక్ ఫంకీ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అన్నది సినిమా వచ్చాకే తెలుస్తుంది.