నేను 'సాగర సంగమం' తీశానని చెప్పలేదు!
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటించిన ఫన్ ఎంటర్‌టైనర్ `ఫంకీ`. అనుదీప్ కెవీ దర్శకత్వం వహించారు.
By: Tupaki Desk | 13 Feb 2026 8:40 PM ISTమాస్ కా దాస్ విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటించిన ఫన్ ఎంటర్‌టైనర్ `ఫంకీ`. అనుదీప్ కెవీ దర్శకత్వం వహించారు. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ప్రచార చిత్రాల నుంచే ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. వరుస ఫ్లాపుల్లో వున్న హీరో విశ్వక్‌సేన్‌కు మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మకాన్ని కలిగించింది. అయితే శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి డివైడ్ టాక్ వినిపిస్తోంది. కొంత మంది సినిమా ఫలితంపై కామెంట్‌లు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన నిర్మాత సూర్యదేవర నాగవంశీ సినిమాపై వస్తున్న కామెంట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
`నేను సాగర సంగమం లాంటి సినిమా తీశానని చెప్పలేదుగా` అన్నారు. ఈ సినిమా ఎలాంటిదో నేను ముందు నుంచే చెబుతున్నాను. అయినా కథలో ఫ్లో లేదు, సీన్ల కోసం కథ రాసినట్టుగా ఉందని కొందరు కామెంట్లు పెట్టారు. ఆ విషయం నేనే చెప్పాను కదా. సైన్‌టిస్ట్‌లాగా మీరేదో కనుక్కున్నట్టు చెబుతారేంటి? ` అని ప్రశ్రించారు. ఈ సినిమాకు సంబంధించి మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి నేను ఇదే చెబుతూ వచ్చాను. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ షో అయినప్పుడు చాలా మంది ఫ్లో లేదు. కొంచెం అతుకులు అతుకులుగా ఉంది` అంటూ కామెంట్‌లు చేశారు.
ముందు నుంచే ఇందులో కథలేదు, కామెడీ కోసమే చేశామని నేనే చెప్పాను. ఒక కామెడీ ఫిల్మ్..సిల్లీ ఫిల్మ్ తీశాము. అనుదీప్ స్టైల్లో వన్ లైనర్స్‌తోనే చెప్పాము. దీన్ని అనుదీప్ మార్క్ కామెడీ ఎంత వరకు పిండిందన్నది ముఖ్యం. ప్రేక్షకులు పెట్టిన డబ్బుకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. తక్కువ బడ్జెట్‌లో అనుదీప్ ఈ మూవీని తీశాడు. ఈ విషయంలో నేను చాలా హ్యాపీ` అన్నారు. నాగవంశీ కాన్ఫిడెన్స్‌ని బట్టి చూస్తుంటే ప్రొడ్యూసర్‌గా డివైడ్ టాక్‌ని సొంతం చేసుకున్నా `ఫంకీ` ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అని స్పష్టమవుతోంది.
అనుకున్న బడ్జెట్‌లో ఎక్కడా అతిగా ఖర్చు చేయకుండా ఈ మూవీని తీసినట్టుగా ఆయన మాటలని బట్టి అర్థమవుతోంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాపై పాజిటీవ్‌గా స్పందిస్తున్నారని చెబుతున్నారంటే వారికి కూడా ఇది లాభదాయకమైన ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. సినిమా విడుదలై వన్ డేనే అవుతోంది. కాబట్టి శివరాత్రి వరకు వేచి చూడటం మంచిది. నాగవంశీ కూడా ఇదే చెబుతున్నారు. ఈ వీకెండ్ వరకు వెయిట్ చేస్తే అసలు రిజల్ట్ ఏంటన్నది క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఆయన అన్నట్టే `ఫంకీ` డివైడ్ టాక్ ఎదుర్కొన్నా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అనిపించుకుంటుందా? అన్నది తెలియాలటే ఈ వీకెండ్ వరకు వేచి చూడాల్సిందే.
