Begin typing your search above and press return to search.

విశ్వక్ ఫంకీ.. వాళ్లకి పండగేనా..?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నెక్స్ట్ అనుదీప్ కెవి డైరెక్షన్ లో ఫంకీ సినిమతో వస్తున్నాడు. ఈ సినిమాలో డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది.

By:  Tupaki Desk   |   11 Jun 2025 9:00 AM IST
విశ్వక్ ఫంకీ.. వాళ్లకి పండగేనా..?
X

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నెక్స్ట్ అనుదీప్ కెవి డైరెక్షన్ లో ఫంకీ సినిమతో వస్తున్నాడు. ఈ సినిమాలో డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుంది. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ అనుదీప్ ఆ నెక్స్ట్ కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. ఆ తర్వాత ఫంకీ చేస్తున్నాడు. విశ్వక్ సేన్ మాస్ ఇమేజ్ కి అనుదీప్ కామెడీ కథ ఎలా సెట్ అవుతుందో చూడాలని ఆడియన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

ఐతే ఈ సినిమాలో కథ కథనాలు అన్నీ కూడా అనుదీప్ మార్క్ ఎంటర్టైనింగ్ మోడ్ లోనే ఉంటాయని తెలుస్తుంది. విశ్వక్ ఫంకీ సినిమాలో కయదు గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు. డ్రాగన్ సినిమాతో సూపర్ పాపులర్ అయిన కయదు ఇదివరకే తెలుగులో అల్లూరి సినిమా చేసింది. ఐతే ఆ టైం లో ఆమెను ఎవరు సరిగా పట్టించుకోలేదు కానీ డ్రాగన్ లో ఆమె గ్లామర్ షో, యాక్టింగ్ కి యూత్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.

అప్పటి నుంచి కయదు కి వరుస ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం కయదు తెలుగులో విశ్వక్ సేన్ ఫంకీతో పాటు మాస్ మహారాజ్ రవితేజతో అనార్కలిలో కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఇదే కాదు కోలీవుడ్ లో శింబు నెక్స్ట్ చేస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది ఈ అమ్మడు. సో కయదు లోహర్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. విశ్వక్ సినిమాలో హీరోయిన్స్ కి మంచి పాత్ర ఉంటుంది.

ఫంకీ సినిమాలో కయదు కూడా హైలెట్ అయ్యేలా ఉంటుందట. క్యారెక్టరైజేషన్ మాత్రమే కాదు అమ్మడు తన గ్లామర్ షోతో కూడా అదరగొట్టేస్తుందని అంటున్నారు. సో ఫంకీ సినిమా కయదు ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే అని చెబుతున్నారు. కయదు లోహర్ తెలుగులో ఒక్క హిట్ కొడితే మాత్రం ఆమెకు మరిన్ని ఛాన్స్ లు వచ్చేలా ఉన్నాయి. ఇక తనకు డ్రాగన్ సినిమాతో వచ్చిన క్రేజ్ తో అమ్మడు రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని టాక్.

ఏది ఏమైనా కాలం కలిసి వచ్చింది కాబట్టి కయదు మలి ప్రయత్నాలు అన్నీ ఆమెకు సూపర్ క్రేజ్ తెస్తున్నాయి. తెలుగులో అల్లూరి సినిమాను ఎవరు గుర్తించకపోయినా డ్రాగన్ తర్వాత ఆ సినిమా సీన్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మరి ఫంకీ, అనార్కలితో అమ్మడు ఏ రేంజ్ లో ఊపేస్తుందో చూడాలి.