ఆ రెండు సినిమాల్లో బూతుల బలంగానే?
ఒకప్పుడు సినిమాలో బూతు డైలాగులుంటే? వాటికి కత్తెర పడేది. అలాంటి చిత్రాలను చూడటానికి కూడా ప్రేక్షకులు ముందుకొచ్చే వారు.
By: Tupaki Desk | 25 Dec 2025 9:59 AM ISTఒకప్పుడు సినిమాలో బూతు డైలాగులుంటే? వాటికి కత్తెర పడేది. అలాంటి చిత్రాలను చూడటానికి కూడా ప్రేక్షకులు ముందుకొచ్చే వారు. క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటే తప్ప సెన్సార్ కూడా క్లియరెన్స్ ఇచ్చేది కాదు. శ్రుతి మించిన సన్నివే శాలు..డైలాగుల విషయంలో కట్స్ పడేవి. కానీ ఇప్పటి సినిమాల్లో సన్నివేశం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. కత్తెర వేస్తే సినిమాకు సమస్యగా మారుతుంది. ఎన్ని బూతు డైలాగులుంటే సినిమాకు అంత హైప్ వస్తుంది. కత్తెర వేయడానానికి వీల్లేదంటూ సెన్సార్ కు నిర్మాతే కండీషన్ పెడుతున్నాడు. `ఏ` సర్టిపికెట్ వచ్చినా పర్వాలేదు.
ఎంచక్కా థియేటర్లో రిలీజ్ చేసుకుంటామని తీసుకుంటున్నారు. కొంత కాలంగా ఇదే ట్రెండ్ గా మారింది. ఈ విషయంలో దర్శక-హీరోలు కూడా ఎంత మాత్రం రాజీ పడటం లేదు. లార్జర్ దేన్ లైఫ్ ఎంటర్ టైనర్లు కాదు అంతకు మించి తమ సినిమాలో కంటెంట్ ఉంటుందని హైలైట్ చేస్తున్నారు. కంటెంట్ ని వీలైనంత `రా`గా మారుస్తున్నారు. మాస్ సన్నివేశాలను మరింత బలంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. హీరో పాత్రని అంతే మాసీవ్ కోణంలో ఎలివేట్ చేస్తున్నారు. సన్నివేశంలో ఘాడత తెలియజేసే క్రమంలో డైలాగులు కూడా శ్రుతి మించుతున్నాయి.
పుష్క లంగా వీలైనంత బూతును జొప్పిస్తున్నారు. తాజాగా ఓ రెండు సినిమాల్లో కూడా అలాంటి బూతు డైలాగులకు ఏమాత్రం కొదవ లేదని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రవికిరణ్ కోలా `రౌడీజనార్దన` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. గోదారి జిల్లాల్లో రౌడీయిజాన్ని ఇందులో హైలైట్ చేస్తున్నాడు. ఇంత వరకూ ఈ జిల్లాల రౌడీ నేపథ్యాన్ని ఏ దర్శకుడు తీసుకోలేదు. ఎక్కువగా రాయలసీమ ప్రాంతం రౌడీయిజమే హైలైట్ అయింది. రవికిరణ్ అందుకు భిన్నంగా ట్రై చేస్తున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన గ్లిప్స్ తో విజయ్ లో మాస్ కోణాన్ని మరోసారి హైలైట్ చేసాడు. గోదారి జిల్లాలు బూతలకు ప్రసిద్దే.
గోదారి స్లాంగ్ లో బూతు పదజాల సైటైరికల్ గా అనిపిస్తుంది. అందులో హాస్యం హైలైట్ అవుతుంది. దీంతో బూతు అనేది పెద్ద గా ఫోకస్ అవ్వదు. అలాంటి డైలాగులు రౌడీజనార్దనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల `ది ప్యారడైజ్` తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసింందే. క్లాసిక్ హీరో అయిన నాని `హిట్ 3` తో అతడన్ని బూతు స్టార్ ని చేసేసారు. బూతు డైలాగుల విషయంలోనూ నాని రాజీ పడే నటుడు కాదని అర్దమైంది. ప్యారడైజ్ పాత బస్తీ రౌడీయిజం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్తీ నేపథ్యం బూతు పదజాలం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
