హీరోయిన్ ఎంపికలో వాళ్లిద్దరు స్పెషల్!
స్టార్ హీరో సరసన హీరోయిన్ అంటే? ఆ హీరో రేంజ్ కు ధీటుగా ఉండాలి. ఆమె కూడా పెద్ద స్టార్ హీరోయిన్ అయి ఉండాలి.
By: Tupaki Desk | 25 April 2025 2:30 AMస్టార్ హీరో సరసన హీరోయిన్ అంటే? ఆ హీరో రేంజ్ కు ధీటుగా ఉండాలి. ఆమె కూడా పెద్ద స్టార్ హీరోయిన్ అయి ఉండాలి. పారితోషికం కోట్లలో ఛార్జ్ చేసే రేంజ్ కలిగి ఉండాలి. ఎంపికలో ఇమేజ్ మాత్రమే కీలక పాత్ర పోషిస్తుంది. ఆ ప్రకారమే దర్శకులు హీరోయిన్ ని ఎంపిక చేస్తారు. దాదాపు స్టార్ డైరెక్టర్లు అంతా ఇదే పాలసీ అనుసరిస్తారు. కానీ ప్రశాంత్ నీల్...సందీప్ రెడ్డి వంగా మాత్రం అందుకు భిన్నంగా వెళ్తుంటారు.
ఈ నయా డైరెక్టర్ల సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే? ఆ భామకు పెద్దగా ఇమేజ్ అవసరం లేదు. స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ అంతకన్నా పనిలేదు. తాము రాసుకున్న పాత్రకు సెట్ అయితే చాలు ఇమేజ్ తో పనిలేకుండా ఛాన్స్ కల్పిస్తారు. ప్రశాంత్ నీల్ ఈ విషయంలో కన్నడ భామలకే ప్రాధాన్యత ఇస్తారు. `కేజీఎఫ్` లాంటి పాన్ ఇండియా సినిమా తీసి అందులో కన్నడ భామ శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నాడు.
అదే ఆమెకు హీరోయిన్ గా తొలి సినిమా. అప్పటికే మోడలింగ్ చేసిన శ్రీనిధిని పేపర్లో యాడ్ చూసి `కేజీఎఫ్` చిత్రం కోసం పిలిపించి వెంటనే ఫైనల్ చేసాడు. `కేజీఎఫ్` పెద్ద హిట్ అయిందని రెండవ భాగంలో హీరోయిన్ ని మార్చలేదు. ` కేజీఎఫ్ 2` లో కూడా ఆమెనే కొనసాగించాడు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిస్తోన్న `డ్రాగన్` సినిమా కోసం రుక్మిణీ వసంత్ ని తీసుకున్నాడు.
ఈమె కూడా కన్నడిగే. పాన్ ఇండియాలో ఇమేకు ఎలాంటి ఇమేజ్ లేదు. కానీ ఆ పాత్రకు సెట్ అవ్వడంతో మరో ఆలోచన లేకుండా ఎంపిక చేసారు. ఇక `సలార్` లో శ్రుతి హాసన్ నటించినా? ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. రెండవ భాగంలో ప్లాష్ బ్యాక్ లో ప్రభాస్ హీరోయిన్ గా మరో కన్నడ భామ కనిపిస్తుందని సమాచారం. సందీప్ రెడ్డి వంగా కూడా హీరోయిన్ విషయంలో ఎలాంటి ఎక్స్ పక్టేషన్స్ ఉండదు.
తొలి సినిమా `అర్జున్ రెడ్డి`లో షాలిని పాండేను తీసుకున్నాడు. ఒక్క సినిమాతోనే షాలిని ఫేమస్ అయింది. అటుపై `యానిమల్` లో రష్మిక మందన్నా మెయిన్ లీడ్ అయినా? సెకెండ్ లీడ్ లో కనిపిం చిన త్రిప్తీ డిమ్రీ ఎక్కువ ఫేమస్ అయింది. అప్పటి వరకూ త్రిప్తీకి సరైన స క్సెస్ లేదు. స్టార్స్ తో నటించిన అనుభవం లేదు. అయినా జోయా పాత్రకు తాను మాత్రమే న్యాయం చేయగలదని తీసుకు న్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో `స్పిరిట్` తెరకెక్కించే పనుల్లో ఉన్నాడు సందీప్ .దీంతో ఈ సినిమా కోసం ఏ కొత్త భామను దించుతాడని సర్వత్రా ఆసక్తి నెలకొంది.