Begin typing your search above and press return to search.

ఓటీటీలోకి భారీగా సినిమాలు.. ఆ రెండింటిపైనే ఫోకస్

పరీక్షల సీజన్ కనుక ఈ వీక్.. థియేటర్ల తోపాటు ఓటీటీలో స్టార్ హీరోల మూవీస్ రిలీజ్ కావడం లేదు

By:  Tupaki Desk   |   26 Feb 2024 10:36 AM GMT
ఓటీటీలోకి భారీగా సినిమాలు.. ఆ రెండింటిపైనే ఫోకస్
X

పరీక్షల సీజన్ కనుక ఈ వీక్.. థియేటర్ల తోపాటు ఓటీటీలో స్టార్ హీరోల మూవీస్ రిలీజ్ కావడం లేదు. థియేటర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ మార్చి ఒకటవ తేదీన విడుదల కానుంది. దీంతో పాటు వ్యూహం, చారి 111, భూతద్దం భాస్కర నారాయణ పలు చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అయితే సినీ లవర్స్ లో వరుణ్ మూవీ తప్ప మిగతా వీటిపై పెద్దగా హోప్స్ లేవు.

అయితే ఇటీవల కాలంలో ఓటీటీలకు రెస్పాన్స్ భారీగా పెరిగింది. ప్రతి మూవీకి థియేట్రికల్ రిలీజ్ డేట్ తో పాటు ఓటీటీ విడుదల తేదీని కూడా మేకర్స్ ఫిక్స్ చేస్తున్నారు . ఈ వీక్.. థియేటర్లలో బడా సినిమాలు లేకపోయినా.. 30కు పైగా సినిమాలు, వెబ్ సీరీస్ లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యాయి. అందులో బ్లూ స్టార్, ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీపై ఓటీటీ ఆడియన్స్ లో మంచి ఇంట్రెస్ట్ ఉంది. మరి ఏ సినిమాలు ఎక్కడ స్ట్రీమ్ అవుతాయో తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్

ఫిబ్రవరి 27వ తేదీ- ఇండిగో (ఇండోనేసియా మూవీ)

ఫిబ్రవరి 28- అమెరికన్ కాన్స్పిరసీ ద ఆక్టోపస్ మర్డర్ వెబ్ సిరీస్

ఫిబ్రవరి 28- కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్)

ఫిబ్రవరి 28- ద మైర్

ఫిబ్రవరి 29- ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్(టర్కిష్ వెబ్‌ సిరీస్ )

ఫిబ్రవరి 29- మన్ సూ ఆంగ్ (థాయ్ సినిమా)

ఫిబ్రవరి 29- ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ (హిందీ సినిమా),

ఫిబ్రవరి 29- ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్)

మార్చి 1- మామ్లా లీగల్ (హిందీ సిరీస్)

మార్చి 1- మై నేమ్ ఈజ్ లోహ్ కివాన్ (కొరియన్ మూవీ)

మార్చి 1- షేక్ (కొరియన్),

మార్చి 1- ర్యాటెల్ అండ్ రోల్ (కొరియన్)

మార్చి 1- సమ్‌ బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్)

మార్చి 1- స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ)

మార్చి 1- ద పిగ్ అండ్ ద స్నేక్ (ఇంగ్లీష్ సినిమా)

మార్చ్ 3- స్లామ్ (నెట్ ఫ్లిక్స్ ఓన్)

అమెజాన్ ప్రైమ్

ఫిబ్రవరి 26- వెడ్డింగ్ ఇంపాజిబుల్ ( కొరియన్ వెబ్‌ సిరీస్ )

ఫిబ్రవరి 26- ఎనీ వన్ బట్ యూ (ఇంగ్లీష్ మూవీ)

ఫిబ్రవరి 27- పూర్ థింగ్స్ (ఇంగ్లీష్ సినిమా)

ఫిబ్రవరి 29- బ్లూ స్టార్ (తమిళం),

ఫిబ్రవరి 29- పా పాట్రోల్ (ఇంగ్లీష్ మూవీ)

ఫిబ్రవరి 29- రెడ్ క్వీన్,

మార్చి 1- నైట్ స్విమ్

హాట్ స్టార్

ఫిబ్రవరి 28- ఇవాజు (ఇంగ్లీష్ వెబ్ సిరీస్),

ఫిబ్రవరి 28- ద ఇంపాజిబుల్ హెయిర్(కొరియన్ సిరీస్)

మార్చి 1- వండర్‌ ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్)

ఆహాలో ఫిబ్రవరి 26వ తేదీన బూట్ కట్ బాలరాజు, ఈటీవీ విన్ లో మార్చి 2వ తేదీన రవితేజ ఈగల్, జీ5లో మార్చి 1న హిందీ వెబ్‌ సిరీస్ సన్‌ ఫ్లవర్, జియో సినిమాలో ఫిబ్రవరి 27న ఇంగ్లీష్ మూవీ ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.