Begin typing your search above and press return to search.

ఆ రెండు ఫ్లాప్ మూవీస్ మళ్లీ వచ్చాయి

ఈ రోజుల్లో ఫ్లాప్‌ మూవీస్ అయిన భోళా శంకర్‌ మరియు రామబాణం సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు ఎక్కువ సమయం తీసుకున్నాయి.

By:  Tupaki Desk   |   15 Sep 2023 3:31 AM GMT
ఆ రెండు ఫ్లాప్ మూవీస్ మళ్లీ వచ్చాయి
X

థియేటర్ రిలీజ్ అయిన మూడు లేదా నాలుగు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఈ రోజుల్లో ఫ్లాప్‌ మూవీస్ అయిన భోళా శంకర్‌ మరియు రామబాణం సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు ఎక్కువ సమయం తీసుకున్నాయి. గత నెలలో విడుదల అయిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా నేటి నుండి ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ సినిమాకు మెహర్‌ రమేష్ దర్శకత్వం వహించగా అనిల్ సుంకర భారీ బడ్జెట్‌ తో నిర్మించాడు. మహా నటి ఫేం కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవికి సోదరి పాత్రలో నటించగా, హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో కామెడీ కోసం జబర్దస్త్‌ కమెడియన్స్ ను దించడం జరిగింది.

ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్‌ సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా ఫలితం తారుమారు అవ్వడం తో ఫ్యాన్స్ కూడా నిరుత్సాహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో భోళా శంకర్ సినిమా పై ట్రోల్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. దాంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ సమయంలో ఎలాంటి ట్రోల్స్ వస్తాయో అని మెగా ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఓటీటీ లో భోళా శంకర్ సినిమాను ముందస్తుగా పెద్ద ప్రచారం చేయకుండా సైలెంట్ గానే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇక గోపీచంద్‌ నటించిన రామబాణం సినిమాను కూడా అదే విధంగా సైలెంట్ గా స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో చాలా రోజులు వాయిదా పడుతూ వచ్చింది. గోపీచంద్ కు ఒక మంచి విజయాన్ని కట్టబెడుతుందని భావించిన రామబాణం సినిమా నిరాశ పరిచింది.

చిరంజీవి భోళా శంకర్ మరియు గోపీచంద్‌ రామబాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. దాంతో సైలెంట్‌ గానే ఈ రెండు సినిమాలను స్ట్రీమింగ్ చేయడం జరిగిందని తెలుస్తోంది. చిరంజీవి సినిమా అయినప్పటికి సోషల్ మీడియాలో దారుణ ట్రోల్స్ రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్ కి పెద్దగా బజ్ క్రియేట్‌ అవ్వలేదు. కనుక ఇప్పుడు మళ్లీ వచ్చిన ఈ ఫ్లాప్ సినిమాలను జనాలు పెద్దగా పట్టించుకుంటారా అనేది చూడాలి.