రకుల్- భగ్నానీ 'ఫిట్ ఇండియా కపుల్'
నేటి యోగాంధ్ర, ఫిట్ ఇండియా యోగాథాన్ ఉద్యమాలు దిగ్విజయంగా కొనసాగాయి. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశం ఫిట్ ఇండియా కల్ట్ యోగాథాన్ నిర్వహించడం ద్వారా ఒక అద్భుతమైన ఫిట్‌నెస్ ఉద్యమానికి తెర తీసింది.
By: Tupaki Desk | 21 Jun 2025 10:22 AM ISTనేటి యోగాంధ్ర, ఫిట్ ఇండియా యోగాథాన్ ఉద్యమాలు దిగ్విజయంగా కొనసాగాయి. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశం ఫిట్ ఇండియా కల్ట్ యోగాథాన్ నిర్వహించడం ద్వారా ఒక అద్భుతమైన ఫిట్‌నెస్ ఉద్యమానికి తెర తీసింది. దేశవ్యాప్తంగా 10లక్షల మంది (1 మిలియన్) సూర్య నమస్కారాలు ఒకేసారి చేసారు. ఒక్క విశాఖ నగరంలో యోగాంధ్ర కార్యక్రమంలో లక్షలాది మంది యోగాథాన్ లో పాల్గొన్నారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వేలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.
ఆరోగ్యం ఆనందానికి సంబంధించిన ఈ అద్భుత ఈ కార్యక్రమం భారతీయతను ఆపాదించుకున్నది. యోగా ఫిటెన్స్ ప్రాముఖ్యతను ప్రపంచానికి మరోసారి తెలియజేస్తూ, అందాల కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ఆమె భర్త, నటుడు-నిర్మాత జాకీ భగ్నాని దిల్లీలోని వేదికపై సూర్య నమస్కారాలను ప్రదర్శించారు. ఇది ఫిట్‌నెస్‌ను జీవన విధానంగా ప్రచార కార్యక్రమం. ఆరోగ్యంతో మంచి సమతుల్య జీవనవిధాన ప్రచారానికి నాందిగా మారింది. యోగా పుట్టిల్లు అయిన భారతదేశ కార్యక్రమాలపై ప్రచారానికి ఆదర్శ రాయబారులుగా రకుల్- భగ్నానీ జంట కొనసాగుతారు. వారి సహకారానికి గుర్తింపుగా ఈ జంటకు వేదిక వద్ద 'ఫిట్ ఇండియా కపుల్' అనే బిరుదును ప్రదానం చేసారు.
భార్యాభర్తలు ఫిట్నెస్ ఫ్రీక్స్, యోగ సాధనతో వారు ఆరోగ్యంతమైన జీవనాన్ని గడుపుతున్నారు. పది మందికి ఆదర్శంగా ఉన్నారు. రకుల్- జాకీ జీవన విధానం అందరికీ స్ఫూర్తినిస్తుందని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే వారు ఈ బిరుదు అందుకోవడానికి అర్హులు అని అన్నారు. గత సంవత్సరం ఇదే తరహాలో నటుడు ఆయుష్మాన్ ఖురానాకు 'ఫిట్ ఇండియా ఐకాన్' బిరుదును ప్రదానం చేశారు. ఇప్పుడు రకుల్- భగ్నానీ జంట సోషల్ మీడియా ద్వారా ఈ చొరవను ప్రచారం చేస్తున్నారు. లక్షలాదిగా ఉన్న వారి ఫాలోవర్స్ ను యోగాను స్వీకరించి దేశవ్యాప్తంగా వెల్నెస్ వేడుకలో చేరాలని ప్రోత్సహించడం ఆసక్తిని కలిగిస్తోంది.
