నటుడు ఫిష్ వెంకట్ మృతి
టాలీవుడ్ సీనియర్ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 July 2025 10:54 PM ISTటాలీవుడ్ సీనియర్ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఆయన మృతి చెందారని తెలుస్తోంది. ఫిష్ వెంకట్ చివరి రోజుల్లో కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. ఆయన రెండు కాళ్లు తొలగించారు. లివర్ పూర్తిగా పాడయింది. కిడ్నీ సమస్య తలెత్తడంతో రీప్లేస్ చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆయన సతీమణి తమ ధీన స్థితి గురించి మొరపెట్టుకున్నారు. ఆర్థికంగా ఆదుకోవాలని కూడా పిలుపునిచ్చారు.
ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం చేసారు. మూత్రపిండాల వైఫల్యం, అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నారని కథనాలొచ్చాయి. రెండు కాళ్లు పోగొట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని తెలిసింది. అయితే అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి.. మెగా వారసుడు రామ్ చరణ్ కూడా తనకు చికిత్స చేయించుకోవడానికి సహకరిస్తున్నారని వెల్లడించారు. తన పరిస్థితిని తెలుసుకుని తండ్రీ కొడుకులు ఎంతగానో ఆర్థిక సహాయం చేసారని కూడా ఫిష్ వెంకట్ వెల్లడించారు.
ఫిష్ వెంకట్ కష్టం చూసి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2 లక్షల ఆర్థిక సాయం అందించగా, నిర్మాత చదవలవాడ లక్ష ఆర్థిక సహాయం చేసారు. యువహీరో విశ్వక్ సేన్ సహా పలువురు ఆర్థిక సాయమందించారు. ఫిష్ వెంకట్ `గబ్బర్‌సింగ్` చిత్రంలో నటించాడు. చాలా సినిమాల్లో విలన్ వేషాలతో పాటు కమెడియన్ గా రాణించాడు. దాదాపు వంద పైగా చిత్రాల్లో నటించాడు.
