Begin typing your search above and press return to search.

ఫిష్ వెంకట్ కూతురు సంచలన కామెంట్స్..!

ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి మృతి చెందారన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 July 2025 5:47 PM IST
ఫిష్ వెంకట్ కూతురు సంచలన కామెంట్స్..!
X

ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి మృతి చెందారన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈమధ్య ఆరోగ్యం మరింత క్షీణించడం వల్ల హాస్పిటల్ లో జాయిన్ చేశారు. సాటి నటుడు అనారోగ్యంతో ఉన్నాడని ఎవరు కూడా ముందుకు వచ్చి ఆర్ధిక సాయం చేయలేదట. విశ్వక్ సేన్, మరో యువ నటుడు కృష్ణ తప్ప ఎవరు తమకు సాయం చేయలేదని ఫిష్ వెంకట్ కూతురు వెల్లడించారు.

రామ్ చరణ్ నుంచి ఎలాంటి సాయం రాలేదని. క్లికార ఫౌండేషన్ నుంచి పాతిక వేలు మాత్రమే ఇచ్చారని. కానీ మిగతా వారంతా ఫిష్ వెంకట్ కి సాయం అందిందని ఆయన్ను మంచి హాస్పిటల్ కి తీసుకెళ్లారని అసత్య ప్రచారాలు చేశారు. దీని వల్ల సాయం చేయాలని అనుకున్న వారు కూడా ఆగిపోయారు. ఈ విషయాన్నే ఫిష్ వెంకట్ కూతురు చెప్పారు.

తన తండ్రికి ఎవరు అండగా నిలబడలేదని.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఆర్ధిక సాయం అందించామని అసత్య ప్రచారాలు చేశారని వాపోయారు ఫిష్ వెంకట్ కూతురు. మంచి ట్రీట్ మెంట్ ఇప్పించి ఉంటే తప్పనిసరిగా నాన్న బ్రతికి ఉండే వారని ఆమె అన్నారు.

సోషల్ మీడియా వల్ల కొంతమేరకు అసత్య ప్రచారాలే ఎక్కువ నమ్మేలా చేస్తున్నాయి. ఐతే ఫిష్ వెంకట్ కి పెద్ద హీరోలెవరు సాయం చేయకపోవడంపై నెటిజెన్లు విమర్శిస్తున్నారు. అంతేకాదు ఆయన మృతి చెందిన వార్త తెలిసినా కూడా ఏ హీరో కూడా కనీసం ఒక చిన్న మెసేజ్ కూడా చేయలేదు.

పరిశ్రమలో పెద్ద చిన్న తారతమ్యాలు ఉండవని అంటారు. కానీ చిన్న నటుడు కష్టాల్లో ఉన్న టైంలో అతన్ని ఆదుకోవాల్సిన స్టార్స్ ఇంకా పరిశ్రమ పెద్దలు ఏం చేస్తున్నారని సోషల్ మీడియాలో అడుగుతున్నారు. దాదాపు 100 సినిమాలకు పైగా నటించిన ఫిష్ వెంకట్ కి పరిశ్రమ ఇచ్చే గౌరవం ఇదేనా.. ఆయనకు నివాళి అర్పించే తీరిక కూడా లేకుండా ఉందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఫిష్ వెంకట్ సినిమాల విషయానికి వస్తే.. ముందు విలన్ వెనకాల నిలబడిన రోల్స్ చేస్తూ వచ్చి తన పంచ్ లైన్స్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు ఫిష్ వెంకట్. చిన్నగా అతని స్క్రీన్ స్పేస్ పెంచుతూ మంచి ఐడెంటిటీ ఏర్పడేలా చేశారు. ఐతే ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యలకు పరిశ్రమ పెద్దల నుంచి కూడా ఎలాంటి ఆర్ధిక సాయం అందలేదని తెలుస్తుంది. ఫిష్ వెంకట్ మృతి పట్ల కొందరు యువ హీరోలు మాత్రమే స్పందించి వారి నివాళి అర్పించారు.