Begin typing your search above and press return to search.

జక్కన్న, మహేష్.. ఇది ఫస్ట్ టాస్క్

ఇదిలా ఉంటే స్క్రిప్ట్ లాక్ అయిన వెంటనే జక్కన్న వర్క్ షాప్ స్టార్ట్ చేయనున్నాడంట. సుమారు రెండు నెలల పాటు మూవీకి సంబందించిన వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   28 Feb 2024 3:35 AM GMT
జక్కన్న, మహేష్.. ఇది ఫస్ట్ టాస్క్
X

ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నారు. జక్కన్న కూడా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే స్క్రిప్ట్ లాక్ అయిన వెంటనే జక్కన్న వర్క్ షాప్ స్టార్ట్ చేయనున్నాడంట. సుమారు రెండు నెలల పాటు మూవీకి సంబందించిన వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వర్క్ షాప్ లో భాగంగా మొదటి మూడు వారాలు ఆర్ట్స్ డైరెక్టర్, కెమెరామెన్ లతో జక్కన్న షూటింగ్, లొకేషన్స్, సెట్ వర్క్, విజువలైజేషన్ కి సంబందించిన డిస్కషన్ ఉంటుందంట.

తరువాత మహేష్ బాబు వర్క్ షాప్ లో జాయిన్ అవుతారని టాక్. మహేష్ పై టెస్ట్ షూట్ కూడా ఈ వర్క్ షాప్ లో భాగంగా చేయనున్నారంట. వర్క్ షాప్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఈ ఏడాదిలో ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో జక్కన్న మహేష్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు.

ఈ సినిమాకి సంబంధించి క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ప్రస్తుతం జక్కన్న ఉన్నారని ప్రచారం నడుస్తోంది. ఇండోనేషియాకి చెందిన బ్యూటీని మహేష్ బాబుకి జోడీగా ఇప్పటికే ఖరారు చేశారని టాక్. అలాగే కొంతమంది హాలీవుడ్ స్టార్స్ ని కూడా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.

ఏది ఏమైనా జక్కన్న, మహేష్ సినిమా మాత్రం ఈ సారి హాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆర్ఆర్ఆర్ తోనే జక్కన్న హాలీవుడ్ టెక్నీషియన్స్ ని, జేమ్స్ కామెరూన్, స్టీవ్ స్పిల్ బర్గ్ లాంటి స్టార్ దర్శకులని మెప్పించారు. నాటునాటు సాంగ్ కి ఆస్కార్ కూడా అందుకున్నారు. ఇప్పుడు మహేష్ బాబు మూవీతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారనేది చూడాలి.