Begin typing your search above and press return to search.

అన్ స్టాపబుల్ కోసం మొదటి బాలీవుడ్ హీరో!

ఇక ఈ సీజన్ లో ఒక ఎపిసోడ్ కి బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన, సందీప్ రెడ్డి వంగా రాబోతున్నారంట.

By:  Tupaki Desk   |   9 Nov 2023 3:55 AM GMT
అన్ స్టాపబుల్ కోసం మొదటి బాలీవుడ్ హీరో!
X

బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ సీజన్ 3 రీసెంట్ గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటి ఎపిసోడ్ భగవంత్ కేసరి టీమ్ తో జరిగింది. ఈ ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యింది. భగవంత్ కేసరి చిత్ర విశేషాలతో పాటుగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకి సంబందించిన ఇంటరెస్టింగ్ ప్రశ్నలు బాలయ్య వేసి అభిమానులకి వినోదం అందించారు.

ఇక ఈ సీజన్ లో ఒక ఎపిసోడ్ కి బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన, సందీప్ రెడ్డి వంగా రాబోతున్నారంట. వీరి కాంబోలో తెరకెక్కిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న థియేటర్స్ లోకి పాన్ ఇండియా రేంజ్ లో రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. టి-సిరీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఐదు భాషలలో ప్రేక్షకులని పలకరించబోతోంది.

ఈ మూవీ ప్రమోషన్స్ యాక్టివిటీస్ త్వరలో స్టార్ట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. హిందీతో పాటుగా తెలుగులో గ్రాండ్ గా ప్రమోషన్ చేయాలని సందీప్ రెడ్డి వంగా డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే అన్ స్టాపబుల్ సీజన్ 3 ఎపిసోడ్ లో కూడా పార్టిసిపేట్ చేయడానికి డిసైడ్ అయ్యారంట.

త్వరలో దీనికి సంబందించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రణబీర్ కపూర్ ఈ షోలో పాల్గొంటే మాత్రం బాలయ్య స్టైల్ హోస్టింగ్ కి కచ్చితంగా ఫిదా అయిపోతారు. అలాగే బాలయ్యతో రచ్చ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండే అవకాశం ఉంది. అసలే బాలయ్యకి రష్మిక ఫేవరేట్ స్టార్ కూడా. ఈ కారణంగా ఆ ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్ కి తిరుగుండదు అనే మాట వినిపిస్తోంది.

అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. త్వరలో దీనిపై సోషల్ మీడియా ద్వారా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సీజన్ 3లో ఇప్పటి వరకు కేవలం భగవంత్ కేసరి టీమ్ తో మాత్రమే చిట్ చాట్ అయ్యింది. ఇంకా ఈ సీజన్ లో ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయనేది కూడా ఆహా టీమ్ నుంచి క్లారిటీ లేదు. సలార్ టీమ్ కూడా ఈ సారి అన్ స్టాపబుల్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందనే మాట కూడా వినిపిస్తోంది.