Begin typing your search above and press return to search.

స్టార్ హీరోపై FIR .. షాకిస్తున్న ఆరోప‌ణ‌లు!

ప‌దే ప‌దే బిల్లులు క‌ట్టేయాల‌ని హోట‌ల్ సిబ్బంది అడిగినా కానీ డ‌బ్బు చెల్లించ‌క‌పోవ‌డంతోనే విసిగిపోయి కేసులు పెట్టార‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 3:15 AM GMT
స్టార్ హీరోపై FIR .. షాకిస్తున్న ఆరోప‌ణ‌లు!
X

క్రీడ‌ల‌ను క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించే ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోపై ఎఫ్.ఐ.ఆర్ న‌మోదైంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పాపుల‌ర్ ఫుల్ బాల్ టీమ్ కి స‌హ‌య‌జ‌మానిగా ఉన్న అత‌డు ఔట్ డోర్ (హైద‌రాబాద్ కాకుండా వేరొక నగ‌రం)లో జ‌రిగిన గేమ్స్ కి అటెండ‌య్యారు. అత‌డితో పాటు ఉన్న‌వారి కోసం 23 రూమ్స్ బుక్ చేసారు. వీరంతా హోట‌ల్లో దిగార‌ట‌. కానీ వెళ్లేప్పుడు బిల్లు క‌ట్ట‌కుండా ఎగ‌వేసార‌నే ఆరోప‌ణ‌లతో స‌ద‌రు స్టార్ హీరో స‌హా వారిపైనా హోట‌ల్ య‌జ‌మాని కేసులు బుక్ చేసార‌ని ప్ర‌చారం సాగుతోంది.

స‌ద‌రు హీరోపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోద‌య్యాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప‌దే ప‌దే బిల్లులు క‌ట్టేయాల‌ని హోట‌ల్ సిబ్బంది అడిగినా కానీ డ‌బ్బు చెల్లించ‌క‌పోవ‌డంతోనే విసిగిపోయి కేసులు పెట్టార‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. ఈ వార్త‌ల్లో నిజానిజాలెంత అన్న‌దానిపై ఇంకా ఎలాంటి స్ప‌ష్ఠ‌తా రాలేదు.

అయితే స‌ద‌రు హీరోకి ఇలా హోట‌ల్ బిల్లులు ఎగ్గొట్టాల్సిన అవ‌స‌ర‌మేంటి? అంత ఛీప్ మెంటాలిటీ త‌న‌ది కాదు క‌దా? అని తెలిసిన‌వారు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అలాంటి తెలివిత‌క్కువ ప‌ని చేస్తాడ‌ని కూడా ఎవ‌రూ అనుకోవ‌డం లేదు. అత‌డికి ఉన్న స్టార్ డ‌మ్, బ్యాక్ గ్రౌండ్ ను దృష్టిలో పెట్టుకుంటే ఆ బిల్లులు న‌థింగ్ మ్యాట‌ర్. కూర‌లో క‌రివేపాకులా ఆ మొత్తాన్ని తీసి విసిరేయ‌డం పెద్ద మ్యాట‌రే కాదు క‌దా? అని కూడా కామెంట్ చేస్తున్నారు. హోటల్ వాళ్ల‌తో ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిందా? అన్న కోణంలోను కొంద‌రు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఎఫ్.ఐ.ఆర్ న‌మోదైంది! అంటూ ప్ర‌చారం సాగిపోతోంది. దీనిపై స‌ద‌రు హీరో వివ‌ర‌ణ ఇస్తారేమో చూడాలి.