బాక్సాఫీస్‌ని కాపాడిన రెండు వావ్ ఫ్యాక్టర్స్
ఈ వారం బాక్సాఫీస్ వద్ద రెండు హాలీవుడ్ సినిమాలు సందడి చేస్తున్నాయి. తొలిగా రిలీజైన `ఫైనల్ డెస్టినేషన్ - బ్లడ్ లైన్స్` థియేటర్లలో ఆడియన్స్ ని కుర్చీ అంచు మీదికి జారేంతగా థ్రిల్స్‌కి గురి చేస్తోంది.
By: Tupaki Desk | 19 May 2025 12:00 AM ISTఈ వారం బాక్సాఫీస్ వద్ద రెండు హాలీవుడ్ సినిమాలు సందడి చేస్తున్నాయి. తొలిగా రిలీజైన `ఫైనల్ డెస్టినేషన్ - బ్లడ్ లైన్స్` థియేటర్లలో ఆడియన్స్ ని కుర్చీ అంచు మీదికి జారేంతగా థ్రిల్స్‌కి గురి చేస్తోంది. ఫలితంగా తొలి మూడు రోజుల్లో 15 కోట్ల నికర వసూళ్లు సాధించింది. నాలుగో రోజుతో 20కోట్ల క్లబ్ లో అడుగుపెడుతుంది. నిజానికి ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ లో అన్ని సినిమాలు గూస్ బంప్స్ తెప్పించేవే. అయితే ఈ ఫ్రాంఛైజీకి ఇప్పటివరకూ ఇండియాలో అంతగా గుర్తింపు లేదు. ఇటీవల యూట్యూబ్ సినిమాలు, ఓటీటీ సబ్ స్క్రిప్షన్ల పుణ్యమా అని ఈ సిరీస్ గురించి ప్రజలకు బాగా తెలిసింది. గగుర్పాటుకు గురి చేసే ప్రమాదాలు, మనిషి చావును డిసైడ్ చేసే ప్రమాదకర ఇన్సిడెంట్స్ గురించి ముందే తెలిస్తే, దాని పర్యవసానం ఎలా ఉంటుంది? అనే అద్భుత కాన్సెప్ట్ ని ఒక రేంజులో దర్శకులు తెరపై ఆవిష్కరించారు.
ఇంతలోనే టామ్ క్రూజ్ `మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్` భారతదేశంలో విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు 19 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఎంఐ - డెడ్ రికనింగ్ (2023) డే వన్ వసూళ్ల (12కోట్లు)ను ఇది అధిగమించింది. ఈ సినిమాకి దక్షిణ భారతదేశం నుంచి స్పందన అనూహ్యంగా రావడంతో భారీ వసూళ్లు నమోదయ్యాయి. ఈ చిత్రం శని, ఆదివారాల్లో అదరగొడుతుంది. సోమవారం వర్కింగ్ డే కాబట్టి కలెక్షన్లు తగ్గినా కానీ, ఈ చిత్రం సుదీర్ఘ కాలం ఆడే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.
టామ్ క్రూజ్- ఏథన్ హంట్ పాత్రలో ప్రదర్శించే అసాధారణ విన్యాసాలను చూసేందుకు ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులు ఆసక్తిగా ఉండటం మారిన అభిరుచికి నిదర్శనంగా చూడాలి. హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల్లో చివరగా వచ్చిన `మిషన్ ఇంపాజిబుల్ -డెడ్ రికనింగ్` 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఫైనల్ రికనింగ్ కూడా అదే స్థాయి వసూళ్లను అందుకోగలదని అంచనా.
