వణుకు పుట్టించే సినిమాకు ప్రీమియర్స్
ఫైనల్ డెస్టినేషన్ పేరుతో రూపొందిన హాలీవుడ్ భయానక థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
By: Tupaki Desk | 13 May 2025 8:44 AMఫైనల్ డెస్టినేషన్ పేరుతో రూపొందిన హాలీవుడ్ భయానక థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. 2000 సంవత్సరంలో దీని ఫస్ట్ ఫ్రాంచైజ్ విడుదలై సంచలనం సృష్టించింది. సూపర్ నేచురల్ హారర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జేమ్స్ వాంగ్ తెరకెక్కించారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 112 మిలియన్‌లకు మించి వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత 2003, 2006, 2009, 20011లో వరుసగా సిరీస్‌లు విడుదలయ్యాయి.
ఈ నాలుగు సిరీస్‌లు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి మేకర్స్‌కు కాసులు వర్షం కురిపించాయి. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత ఈ ఫ్రాంచైజీ నుంచి మరో భయానక మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. `ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్` పేరుతో రూపొందిన ఈ మూవీకి జాచ్ లిపోవిస్కీ దర్శకత్వం వహించాడు. కైట్లీన్ సాంట జువాన కీలక పాత్రలో నటించిన ఈ మూవీని వార్నర్ బ్రదర్స్ వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 16న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది.
కలలో వచ్చే సంఘటనలు కళ్లముందు జరుగుతూ అత్యంత భయానకంగా మారుతున్నా ఏమీ చేయలేని స్థితిలో అంతా అత్యంత దారుణంగా చనిపోతూ ఉంటారు. ఇదే ప్రధాన కథగా తాజా సినిమాని మరింత వైల్డ్‌గా తెరకెక్కించారు. మే 16న తెలుగులోనూ విడుదల కానున్న ఈ మూవీ ప్రీమియర్ షోలని మే 15న అర్థ్రరాత్రి ఏర్పాటు చేశారు. రాత్రి 11 గంటల 59 నిమిషాలకు తొలి షో డనుంది. మామూలుగా మన దేశంలో స్టార్ హీరోల చిత్రాలకు మాత్రమే ఇలా బెనిఫిట్ షోలని ఏర్పాటు చేయడం తెలిసిందే.
కానీ తొలి సారి ఈ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్‌కు ఇండియాలో ఒక రోజు ముందే అర్థ్రరాత్రి ప్రీమియర్ షోలని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్‌లలో ప్రీమియర్‌లు ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ఇది సరికొత్త ట్రెండ్‌గా మారడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అత్యంత భయానకగా సాగుతూ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ట్రైలరే ఇలా ఉంటే ఇంక సినిమా మరెంత భయంకరంగా ఉంటుందో.