Begin typing your search above and press return to search.

ఇండియాలో హాలీవుడ్ మూవీ దూకుడు.. అప్పుడే రూ.65 కోట్లు!

హాలీవుడ్ కు చెందిన అనేక చిత్రాలు.. ఇండియాలో ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుంటాయన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Jun 2025 9:00 PM IST
ఇండియాలో హాలీవుడ్ మూవీ దూకుడు.. అప్పుడే రూ.65 కోట్లు!
X

హాలీవుడ్ కు చెందిన అనేక చిత్రాలు.. ఇండియాలో ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుంటాయన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కడ రూపొందే ఫ్రాంఛైజీ మూవీస్ కు మన దగ్గర మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. సాలిడ్ రిజల్ట్ కూడా సంపాదించుకుంటాయి. ఇప్పుడు మరో మూవీ విషయంలో అదే జరుగుతోంది. భారీ వసూళ్లను రాబడుతోంది.

హాలీవుడ్ హారర్ ఫ్రాంఛైజీ ఫైనల్ డెస్టినేషన్ కు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి విదితమే. మరణం ఎన్ని రకాలుగా ఉంటుందో ఆ సినిమాల్లో మేకర్స్ చూపించారు. సింపుల్ గా చెప్పాలంటే.. భయపెట్టేశారు కూడా. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలోని ఆరో పార్ట్.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలోనూ రిలీజైంది.

అయితే 2000లో తొలి పార్ట్ రాగా.. 2003, 2006, 2009, 2011లో మిగతా భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆరో పార్ట్ విడుదలవ్వగా.. ఇదే చివరిది. ఇప్పుడు రీసెంట్ పార్ట్ కూడా అందరినీ మెప్పిస్తోంది. ఇండియన్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ అందుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

దీంతో ఇప్పటికే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.65 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. ఇంకా మరిన్ని వసూళ్లు రాబట్టనుందని క్లియర్ గా అర్థమవుతుంది. అయితే కంజ్యూరింగ్ మూవీ తర్వాత ఆ రేంజ్ లో హారర్ మూవీకి రెస్పాన్స్ అండ్ వసూళ్లు రావడం ఫైనల్ డెస్టినేషన్ కు సాధ్యమైందని చెప్పడంలో నో డౌట్.

స్టోరీ లైన్ ఏంటంటే?.. ఒక స్కై వ్యూ హోటల్ లో 1968లో జరగబోయే ప్రమాదాన్ని ముందే ఊహిస్తుంది ఐరిస్ (గాబ్రియల్ రోస్). వందల మందిని కాపాడాలని చూస్తుంది. కానీ చాలా మంది చనిపోతారు. ఆ ప్రమాదం.. అనేక మందిని బలి తీసుకుంటుంది. అనేక కుటుంబాలను కూడా చంపేస్తుంది.

అయితే ఐరిస్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం పక్కాగా ప్లాన్ వేసుకుంటుంది. కానీ ఆ పథకాన్ని చావు జయించి, ఆమె ఫ్యామిలీని ఎలా చంపిందనేది ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మూవీ స్టోరీ. కాగా, ముందు నుంచే సినిమాపై ఆడియన్స్ లో మంచి ఇంట్రెస్ట్ ఉంది. మేకర్స్ దాన్ని ప్రమోషనల్ కంటెంట్ తో పెంచారు. అలా ఇప్పుడు మూవీ ఇండియాలో అదరగొడుతూ సందడి చేస్తోంది.