Begin typing your search above and press return to search.

సందు చూసి నిర్మాత‌ను భ‌ళ్లూక ప‌ట్టు ప‌ట్టార‌ట‌

అత‌డి వ‌ల్ల న‌ష్ట‌పోయిన వారంతా ఒక్కొక్క‌రుగా ముందుకు వ‌చ్చి త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   5 Aug 2023 3:56 AM GMT
సందు చూసి నిర్మాత‌ను భ‌ళ్లూక ప‌ట్టు ప‌ట్టార‌ట‌
X

టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత ఫ్లాపులు ఎదుర్కొంటున్నా వ‌రుస‌గా ఆప‌కుండా చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అత‌డు ప్ర‌ముఖ‌ అగ్ర‌హీరోతో నిర్మించిన తాజా చిత్రం రిలీజ్ కి సిద్ధ‌మ‌వుతోంది. అయితే ఇంత‌లోనే తీవ్రంగా న‌ష్ట‌పోయిన భాగ‌స్వాములంతా ఏక‌మై ముప్పేట దాడి చేస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అత‌డి వ‌ల్ల న‌ష్ట‌పోయిన వారంతా ఒక్కొక్క‌రుగా ముందుకు వ‌చ్చి త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అత‌డు తెర‌కెక్కించిన తాజా చిత్రం రిలీజ్ ముంగిట స‌మ‌స్య‌ను ఫిలింఛాంబ‌ర్ ఎదుటికి తీసుకొస్తున్నార‌ని తెలిసింది.

ఇంత‌కుముందు స‌ద‌రు నిర్మాత ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ స్పై మూవీని తెర‌కెక్కించారు. ఇందులో టాలీవుడ్ ప్ర‌ముఖ యువ‌హీరో న‌టించారు. ఈ స్పై చిత్రానికి సీక్వెల్ ని తెర‌కెక్కించేందుకు నిర్మాత‌లు ఇటీవ‌ల‌ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. అదే స‌మ‌యంలో అతడి సొంత బ్యాన‌ర్ లో అప్ప‌టికే పూర్త‌యిన అగ్ర హీరో సినిమాని విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నారు. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో బ్లాక్ బ‌స్ట‌ర్ స్పై మూవీ భాగ‌స్వాములు అంతా ఏక‌మై త‌మ‌కు జ‌రిగిన న‌ష్టాన్ని చాంబ‌ర్ కి విన్న‌వించుకుని త‌మ‌కు రావాల్సిన దాని గురించి నిల‌దీయ‌నున్నార‌ట‌.

కీల‌క‌మైన స‌మ‌యంలో పాత లెక్క‌లు అడుగుతూ క్లియ‌ర్ చేయాల్సిందిగా నిర్మాత‌పై ఒత్తిడి తెస్తున్నార‌ని తెలిసింది. ఇక స‌ద‌రు నిర్మాత న‌ట‌వార‌సుడితో అత్యంత భారీ బ‌డ్జెట్ వెచ్చించి రూపొందించిన మ‌రో స్పై మూవీ డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ ని ఎదుర్కొంది. దీంతో ఆ సినిమా పంపిణీ హ‌క్కులు చేజిక్కించుకున్న పంపిణీదారు తీవ్ర న‌ష్టాలు పాల‌య్యాన‌ని నివేదిస్తూ కోర్టుకు వెళ్లాడు. న‌ష్టాల గురించి మాట్లాడేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే క‌నీసం ఫోన్ కూడా తీయ‌డం లేదని అపాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేద‌ని స‌ద‌రు పంపిణీదారుడు ఆరోపిస్తున్నారు. చివ‌రికి ఈ గొడ‌వ‌ల్లో ఏం తేల‌నుందోనంటూ చ‌ర్చ సాగుతోంది.