Begin typing your search above and press return to search.

కోట్లున్న వాళ్ల‌కే కోట్లిచ్చి సేవ సాధ్య‌మేనా సారూ!

ఇటీవ‌లే ఓ స్టార్ హీరో సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో ఆ చిత్ర నిర్మాత ఆనందానికి అవ‌దుల్లేవ్. హీరోకి అద‌నంగా పారితోషికం చెల్లించారు

By:  Tupaki Desk   |   7 Sep 2023 4:30 PM GMT
కోట్లున్న వాళ్ల‌కే కోట్లిచ్చి సేవ సాధ్య‌మేనా సారూ!
X

ఇటీవ‌లే ఓ స్టార్ హీరో సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో ఆ చిత్ర నిర్మాత ఆనందానికి అవ‌దుల్లేవ్. హీరోకి అద‌నంగా పారితోషికం చెల్లించారు. అందులో న‌టించిన న‌టీనటులుకు కార్లు..అద‌నంగా పారితోషి కాలు చెల్లించారు. ఇదంతా ఎలాంటి దాపరికం లేకుండా ఎంతో ప‌బ్లిక్ గా జ‌రిగింది. దీంతో ఆ నిర్మాత‌ని అంతా ప్ర‌శంసించారు. సాదార‌ణంగా హీరో పారితోషికాల విష‌యంలో స‌రైన క్లారిటీ ఉండ‌దు.

కానీ ఆ నిర్మాత కార‌ణంగా ఆ స్టార్ హీరో సినిమాకి ఎంత తీసుకుంటార‌న్న‌ది ఓ క్లారిటీ దొరికింది. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే తాజాగా అదే నిర్మాత ఓ ప్ర‌ముఖ ఆసుప‌త్రి త‌రుపున సేవ చేయ‌మ‌ని ఓకోటి రూపాయ‌లు విరాళం అందించారు. సేవ ఎవ‌రూ చేసినా గొప్ప‌దే. సేవ చేయ‌డానికి ఎన్నో స్వ‌చ్ఛద సంస్థ‌లు.. చారిటీలు న్నాయి. కానీ వాటిలో వేటిని సెలక్ట్ చేసుకోకుండా ఓ పెద్ద ఆసుప‌త్రి త‌రుపున త‌న స‌హాయం అందాల‌ని భావించ‌డ‌మే ఆస‌క్తిక‌రం.

కార్పోరేట్ ఆసుప‌త్రుల్లో వైద్యం ఖ‌ర్చు ఎలా ఉంటుందో తెలిసిందే. అలాంటి ఆసుప‌త్రికి స‌ద‌రు నిర్మాత కోటి రూపాయలు త‌న స‌హ‌యంగా అందాలంటూ చెప్ప‌డం ఆశ్చ‌ర్యంగా అనిపించే అంశం. ఇక్క‌డే ఆ నిర్మాత ఇదంతా ప‌బ్లిసిటీ కోసం చేస్తున్నారా? అన్న సందేహాలు తెరపైకి వ‌స్తున్నాయి. ఇంత‌వ‌ర‌కూ ఆయన ఏ కార్య‌క్ర‌మం చేసినా అంతా గోప్యంగా ఉండేది. న‌టీన‌టుల పారితోషికాలు గానీ...నిర్మాణం గానీ...స‌హాయం గానీ ప్ర‌తీది సీక్రెట్ గా ఉండేది.

కానీ ఆ సినిమా విష‌యంలో ప్ర‌తీది ఓ పెన్ గా క‌నిపిస్తుంది. మ‌రి దీని వెనుక అంత‌రార్దం ఏంటో? స‌ద‌రు నిర్మాత కి గ‌త కొంత కాలంగా స‌రైన విజ‌యాలు లేవు. ఆర్దికంగానూ దెబ్బ తిన్నారు. మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నారు. తాజా సినిమా ఫ‌లితంతో చాలా వ‌ర‌కూ అప్పులు తీర్చాసార‌ని వినిపిస్తోంది. మ‌రి ఈ సంద‌ర్భంగా ఇలా త‌న సంతోషాన్ని పంచుకుంటున్నారో? ఏమో!