Begin typing your search above and press return to search.

ఛాన్స్ ఇస్తామంటూ ఇండ‌స్ట్రీలో కొత్త ర‌కం మోసం!

సినిమా ఇండ‌స్ట్రీలో మోసాలెన్నో. ఎలాంటి స‌పోర్ట్ లేకుండా కొత్త‌గా ఇండ‌స్ట్రీకొచ్చిన మోస‌పోయిన వారెంతో మంది ఉన్నారు

By:  Tupaki Desk   |   5 Oct 2023 12:30 PM GMT
ఛాన్స్ ఇస్తామంటూ ఇండ‌స్ట్రీలో కొత్త ర‌కం మోసం!
X

సినిమా ఇండ‌స్ట్రీలో మోసాలెన్నో. ఎలాంటి స‌పోర్ట్ లేకుండా కొత్త‌గా ఇండ‌స్ట్రీకొచ్చిన మోస‌పోయిన వారెంతో మంది ఉన్నారు. అవ‌కాశం ఎర చూపి డ‌బ్బులు దొచేసే కొన్ని గ్యాంగ్ లు ఇప్ప‌టికీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాయి. డ‌బ్బుతో పాటు అవ‌కాశం పేరుతో లోబ‌రుచుకున్న సంఘ‌ట‌నలెన్నో వెలుగులోకి వ‌చ్చాయి. టెక్నాల‌జీతో పాటు మోసాలు కూడా అప్ డేట్ అవుతున్నాయి.

తాజాగా న‌టుడు బ్ర‌హ్మాజీ ఇండ‌స్ట్రీలో కొత్త ర‌కం మోసం జ‌రుగుతుంటూ ఓ ట్వీట్ చేసాడు. అవ‌కాశాల పేరుతో మోసం చేస్తున్నార‌ని...అలాంటి వారితో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు. బ్ర‌హ్మాజీ ట్విట‌ర్ లో ఇలా స్పందించారు. 'అంద‌రికీ హెచ్చ‌రిక ఈ సెల్ నెంబ‌ర్ .. డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ మేనేజ‌ర్ నెంబ‌ర్ లా ఉంటుంది. అత‌ని పేరు అన్నా న‌ట‌రాజ్ దొరై. అత‌ను కాల్ చేసి సార్ నేను లోకేష్ మేనేజ‌ర్ ని.

మీ ప్రోపైల్ లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమాకి షార్ట్ లిస్ట్ అయింది. సినిమా కోసం కాస్ట్యూమ్ లు అవ‌స‌రం అవుతాయి. అందుకు మీరు కొంత డ‌బ్బు చెల్లించాలి. ఆడిష‌న్ అయ్యాక మ‌ళ్లీ తిరిగి డ‌బ్బులు చెల్లిస్తాం అంటారు. ఇది ఇండస్ట్రీ లొ కొత్త త‌ర‌హా మోసం అంటూ బ్ర‌హ్మాజీ ట్వీట్ చేసాడు. ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌రంటే? స‌త్యానంద్ అనే వ్య‌క్తి కొత్త‌గా సినిమాల్లోకి రావాల‌నుకున్న వారిని టార్గెట్ చేసి ఇలాంటి దోపిడీల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తెలిపారు.

అత‌ను ఓ ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ గా ప‌రిచ‌యం చేసుకుని ఈజీగా మోసాలు చేస్తున్నాడ‌ని అన్నారు. ఇలాంటి వారితో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇలాంటి పోస్టులు ఇప్ప‌టికే చాలాసార్లు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. గ‌తంలో ఫేమ‌స్ సెల‌బ్రిటీల పేరిట‌..అగ్ర నిర్మాణ సంస్థ‌ల పేరిట ఆడిష‌న్ ఉందంటూ కొత్త వారికి ఎరి వేసిన గ్యాంగ్ లు దిగాయి. అలాగే దిల్ రాజ్ నిర్మాణ సంస్థ పేరుతోనూ ఇలాంటి మోసం ఒక‌టి గ‌తంలోనే వెలుగులోకి వ‌చ్చింది. అప్పుడే రాజుగారు హెచ్చ‌రించారు.