Begin typing your search above and press return to search.

బాలీవుడ్-టాలీవుడ్ ఛాన్సెస్ ఉన్న కాంబినేష‌న్స్!

హృతిక్ రోష‌న్- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్...షారుక్ ఖాన్-త‌ల‌ప‌తి విజ‌య్ కాంబినేష‌న్స్ ఇప్ప‌టికే షురూ అయిన సంగి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Nov 2023 8:41 AM GMT
బాలీవుడ్-టాలీవుడ్ ఛాన్సెస్ ఉన్న కాంబినేష‌న్స్!
X

హృతిక్ రోష‌న్- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్...షారుక్ ఖాన్-త‌ల‌ప‌తి విజ‌య్ కాంబినేష‌న్స్ ఇప్ప‌టికే షురూ అయిన సంగి తెలిసిందే. బాలీవుడ్ లో ఈకాంబినేష‌న్స్ లో భారీ యాక్ష‌న్ చిత్రాలు రాబోతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం ఒకే భాష‌లోనే మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చూసాం. ఇక‌పై హిందీ న‌టుల‌తో సౌత్ న‌టులు క‌లిసి ప‌నిచేయ డం ప‌రిపాటిగా మారుతుంది. పాన్ ఇండియాలో సౌత్ సినిమా స‌త్తా చాట‌డంతో హిందీ ప‌రిశ్ర‌మ దిగొచ్చి మ‌రీ ద‌క్షిణాది న‌టుల్ని భాగం చేసుకుంటుంది.

ఇలా మూడు ప‌రిశ్ర‌మ‌ల క‌ల‌యిక ఇప్పుడు అంత‌టా ఉత్కంఠ‌ని రేపుతుంది. భ‌విష్య‌త్ లో ఇంకెన్ని క్రేజీ కాంబినేష‌న్స్ లో సినిమాలు వ‌స్తాయి? అన్న ఉత్సాహం అభిమానుల్లో ఉర‌క‌లేస్తుంది. అందుకు ఛాన్సెస్ ఉన్న కాంబినేష‌న్స్ గురించి చిన్న గెస్సింగ్ ఇది. స‌ల్మాన్ ఖాన్ -రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రు మంచి స్నేహితులు. మెగాస్టార్ చిరంజీవితో మంచి బాండింగ్ ఉంది. అందుకే 'ఆచార్య' లో స‌ల్మాన్ గెస్ట్ అప్పిరియ‌న్స్ ఇచ్చారు. ఆ ర‌కంగా చ‌ర‌ణ్ -భాయ్ స్నేహం మ‌రింత బ‌ల‌ప‌డింది.

స‌ల్మాన్ కోసం చ‌ర‌ణ్ ఏదైనా చేస్తాడు? అని చిరంజీవి అన్నారు. అది ఇద్ద‌రి కాంబినేష‌న్ లో భారీ మల్టీస్టార‌ర్ ఎందుక కాకూడ‌దు. చ‌ర‌ణ్ ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్. అలాంటి స్టార్ తో స‌ల్మాన్ కూడా తోడైతే! అది సంచ‌ల‌న‌మే. క‌లిసి ప‌నిచేయ‌డానికి వారిద్ద‌రు రెడీ. స్టోరీ ఒక్క‌టే కావాలి. ఇక షారుక్ ఖాన్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో న‌టించ‌డానికి సిద్దంగా ఉన్నారు. 'జ‌వాన్' ప్ర‌చారంలో భాగంగా ఇద్ద‌రి మ‌ధ్య క్లోజ్ నెస్ అర్ద‌మైంది. ఆ కాంబినేష‌న్ కి త‌గ్గ స్ట్రిప్ట్ కుదిరితే ఒకే ప్రేమ్ లో చేసే ఛాన్స్ ఉంది.

అలాగే మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ న‌టించిన 'లాల్ సింగ్ చ‌డ్డా'లో యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన సంగ‌తి తెలిసిందే. చైకిది బాలీవుడ్ డెబ్యూ. అమీర్ ని చైని ఓ రేంజ్ లో లాంచ్ చేయాల‌ని ప్ర‌య‌త్నించిన ఫ‌లితం ఆశాజ‌న‌కంగా రాలేదు. అమీర్ సైతం టాలీవుడ్ స్టార్ హీరోల‌తో న‌టించ‌డానికి సిద్ద‌మే. చిరంజీవి..నాగార్జున కి అమీర్ మంచి స్నేహితులు అన్న సంగ‌తి తెలిసిందే. ఆ కాంబినేష‌న్స్ షురూ అయినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.