Begin typing your search above and press return to search.

ఆయ‌న‌పై వేసింది సెటైరా?

టాలీవుడ్ లో ఆ నిర్మాత ప్ర‌స్థానం ఎంతో సుదీర్ఘ‌మైన‌ది. పంపినీ రంగం నుంచి వ‌చ్చి నిర్మాత‌గా ఎదిగిన వైనం స్పూర్తి దాయ‌క‌మైంది

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:30 PM GMT
ఆయ‌న‌పై వేసింది సెటైరా?
X

టాలీవుడ్ లో ఆ నిర్మాత ప్ర‌స్థానం ఎంతో సుదీర్ఘ‌మైన‌ది. పంపినీ రంగం నుంచి వ‌చ్చి నిర్మాత‌గా ఎదిగిన వైనం స్పూర్తి దాయ‌క‌మైంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆ స్థాయికి చేర‌డం చిన్న విష‌యం కాదు. కానీ దాన్ని సుసాధ్యం చేసి ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఐడెంటిటీని వేసుకున్నారు. ఆయ‌న ఖాతాలో ఫెయిల్యూర్స్ క‌న్నా స‌క్సెస్ లు ఎక్కువ‌. ఆ ర‌కంగా ఆయ‌న మంచి నిర్ణేత‌గానూ పేరు సంపాదించారు. హీరోలు సైతం ఆయ‌న్ని ఎంతో బ‌లంగా న‌మ్ముతారు.

ఆయ‌న జ‌డ్జిమెంట్ కి తిరుగుండ‌ద‌ని చాలా మంది అభిప్రాయం కూడా. ఆర‌కంగా హీరోల‌తో స‌ద‌రు నిర్మాత‌కి మంచి ర్యాపో ఉంది. ఓ ప్రెండ్ లా మెలుగుతారు. సీనియ‌ర్ ద‌ర్శ‌కుల‌తోనూ అలాగే ఉంటారు. త‌న స‌ల‌హా అక్క‌డ అవ‌స‌రం అనుకుంటే ఇస్తారు. దాన్ని ద‌ర్శ‌కుడు తీసుకున్నా? తీసుకోక‌పోయినా పెద్ద‌గా ప‌ట్టించుకోరు. ఆయ‌న నిర్మాణ సంస్థ‌లో ప‌నిచేసే ద‌ర్శ‌కుల‌కు ఆ ర‌క‌మైన వెసులు బాటు ఉంది.

అలాంటి నిర్మాత ఇప్పుడు ఓ అగ్ర ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నారు. అందులో ఓ అగ్ర హీరో న‌టిస్తున్నాడు. నిజానికి ఈ కాంబినేష‌న్ ఊహించ‌న‌ది. అప్ప‌టిక‌ప్పుడు అనుకోకుండా జ‌రిగిపోయింది. దీంతో నిర్మాత ఎంతో సంతోషంగా ఆ సినిమాని ప్రారంభించారు. అంత‌కు ముందు వ‌చ్చిన ఓ అవకాశం చేజారినా ఇప్పుడు అంత‌క‌న్నా గొప్ప అవ‌కాశంగా భావించి సెట్స్ కి వెళ్లారు.

సినిమాకి భారీగానే ఖ‌ర్చు చేస్తున్నారు. బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌టం లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ బ‌డ్జెట్ విష‌యంలో అటు ఇటు అయింద‌న్న ప్ర‌చారం కూడా రాలేదు. ద‌ర్శ‌కుడికి కావాల్సిన అన్ని ర‌కాల వ‌సతులు స‌మ‌కూర్చుతున్నారు. అయితే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ? క్లారిటీ మిస్ అవుతుంద‌నే అంశంపై స‌ద‌రు నిర్మాత కాస్త అసంతృప్తిగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది.

ఇటీవ‌లే ఓ సంద‌ర్భం లో ఆ రిలీజ్ సంగ‌తి త‌న‌కేం తెలియ‌ద‌ని..ఆ భార‌మంతా ద‌ర్శ‌కుడిదేన‌ని...ఆయ‌న ఎప్పుడంటే? అప్పుడు అన్న‌ట్లు చెప్పుకొచ్చారు. ఓ నిర్మాత ఇలా మాట్లాడే స‌రికి ర‌క‌ర‌కాల సందేహాలు మొద‌ల‌య్యాయి. కోట్ల రూపాయ‌లు డ‌బ్బులు పెట్టే నిర్మాత‌కి సినిమా గురించి తెలియ‌క‌పోవ‌డం ఏంటి? ప్ర‌తీ విష‌యాన్ని పిన్ టూ పిన్ తీసుకునే నిర్మాత ఇలా వ్య‌వ‌రించ‌డం ఏంటి? అని సందేహాలు మొద‌ల య్యాయి. అయితే ఆ వ్యాఖ్య‌ల వెనుక ఆ నిర్మాత సైటైర్ ఉంద‌ని ఆస‌ల్యంగా అవ‌గ‌త‌మవుతుందం టున్నారు కొంద‌రు.