Begin typing your search above and press return to search.

సినీ పైనాన్షియ‌ర్ కుమార్తెతో శింబు పెళ్లి!

న‌య‌న‌తార‌..హ‌న్సిక ల‌తో శింబు గ‌తంలో రిలేష‌న్ షిప్ లో ఉన్నాడు. కొన్నాళ్ల పాటు ప్రేమ ప్రయాణం అనంత‌రం మ‌నస్ప‌ర్ద‌లు రావ‌డంతో విడిపోయారు

By:  Tupaki Desk   |   29 Sep 2023 11:30 PM GMT
సినీ పైనాన్షియ‌ర్ కుమార్తెతో శింబు పెళ్లి!
X

కోలీవుడ్ న‌టుడు శింబు ఇంట పెళ్లి భాజాల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైందా? శింబు ఓ ఇంటివాడు కాబోతున్నాడా? 40కి చేరువ అవ్వ‌డంతో ఇక ఆల‌స్యం పెళ్లికి రెడీ అయ్యాడా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే శింబు పెళ్లి విష‌యంలో కోలీవుడ్ మీడియాలో చాలాసార్లు క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఆయ‌న న‌టుడిగా ఎదిగే క్ర‌మంలో నిత్యం ఎఫైర్ల వార్త‌ల్లోనూ అగ్ర స్థానంలో నిలిచారు.

న‌య‌న‌తార‌..హ‌న్సిక ల‌తో శింబు గ‌తంలో రిలేష‌న్ షిప్ లో ఉన్నాడు. కొన్నాళ్ల పాటు ప్రేమ ప్రయాణం అనంత‌రం మ‌నస్ప‌ర్ద‌లు రావ‌డంతో విడిపోయారు. ఆ త‌ర్వాత నుంచి శింబు ప్రేమ పాఠాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చాడు. ప్ర‌స్తుతం శింబు వ‌య‌సు కూడా 40. దీంతో శింబు పెళ్లి ఎప్పుడూ అంటూ తండ్రి టి. రాజేంద‌ర్ ని అడిగినా స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు అదే అవుతుంద‌ని బ‌ధులిచ్చేవారు.

ఈ విష‌యంలో శింబు మాత్రం ఎస్కేప్ అయ్యేవాడు. పెళ్లి ఎప్పుడంటే? స్కిప్ కొట్టేవాడు .అయితే ఇప్పుడా ఛాన్స్ లేద‌ని కోలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. శింబు ఓ సినీ పైనాన్షియ‌ర్ కుమార్తెని వివాహం చేసుకోబుతున్న‌ట్లు తెలిసింది. ఆ కుటుంబం ఎంతో కాలంగా టి. రాజేంద‌ర్ కుటుంబానికి తెలుసుట‌. రాజేంద‌ర్ స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన ఎన్నో సినిమాల వెనుక ఆయ‌న ఓ భాగ‌స్వామిగా ఉన్నారుట‌.

ఇప్ప‌టికీ ఆ జ‌ర్నీ అలా కొన‌సాగుతుందని..ఈ నేప‌థ్యంలో ఆ స్నేహాన్ని ఇప్పుడు బంధుత్వంగా మార్చుకోబో తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. స‌ద‌రు పైనాన్షియ‌ర్ కి ఒకే కుమార్తె అట‌. త‌మిళ‌నాడులో భారీగా ఆస్తులు..వ్యాపారాలు ఉన్నాయ‌ట‌. ఇది పెద్ద‌లు కుదురుస్తున్న సంబంధం అని..ఇందులో శింబు ఇన్వాల్వ్ మెంట్ ఏంత మాత్రం లేద‌ని అంటున్నారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ వార్త అతి త్వ‌ర‌లోనే అధికారికంగా మీడియా ముందుకొస్తుంద‌ని కోలీవుడ్ మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి. ప్ర‌స్తుతం శింబు న‌టుడిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్ బ్యాన‌ర్ రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్ లో ఓ సినిమా చేస్తున్నాడు.