Begin typing your search above and press return to search.

ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్‌కి కె.విశ్వ‌నాథ్ అవార్డులు

ఇద్దరు పరిశ్రమ ప్రముఖులచే నిర్దేశించిన ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తూ సౌండ్ డిజైన్, డైరెక్షన్ రంగాలలో అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే విద్యార్థులను సత్కరించడానికి ఈ రివార్డ్ అందిస్తారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 10:43 AM GMT
ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్‌కి కె.విశ్వ‌నాథ్ అవార్డులు
X

క‌ళాత‌ప‌స్వి కాశీనాధుని విశ్వనాథ్ గౌరవప్రదమైన వారసత్వాన్ని పురస్కరించుకుని, లెజెండ‌రీ అక్కినేని నాగేశ్వరరావుగారితో ఆయనకు ఉన్న తొలి సంబంధాలను స్మరించుకుంటూ, విశ్వనాథ్ కుమారుడు కె నాగేంద్రనాథ్ తన తోబుట్టువులు, కుటుంబ సభ్యులతో కలసి ప్రతిష్టాత్మక వార్షిక విశ్వనాథ అవార్డును ప్రకటించారు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు చెందిన ఇద్దరు విద్యార్థుల కోసం యువ ఫిలింమేక‌ర్స్‌ను ప్రభావవంతమైన అర్థవంతమైన సినిమాని రూపొందించడానికి ప్రేరేపించే లక్ష్యంతో ఈ అవార్డును అందిస్తున్నారు.


ఇద్దరు పరిశ్రమ ప్రముఖులచే నిర్దేశించిన ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబిస్తూ సౌండ్ డిజైన్, డైరెక్షన్ రంగాలలో అసాధారణమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే విద్యార్థులను సత్కరించడానికి ఈ రివార్డ్ అందిస్తారు. ప్రతి సంవత్సరం ఈ అవార్డు ఇద్దరు విద్యార్థులకు అందిస్తుండ‌గా, ఒక్కొక్కరికి రూ.25,000/- (మొత్తం యాభై వేలు) గ్రాంట్‌గా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అవార్డులు ప్రకటిస్తారు. కాన్వొకేషన్ వేడుకలో వీటిని అందిస్తారు.

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను 2011లో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు స‌హా ఆయ‌న కుటుంబీకులు స్థాపించారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అధ్యాపకులను, విద్యను అందించాలనే లక్ష్యంతో ఇది ఏర్ప‌డింది. ఇప్పుడు ఒక దశాబ్దానికి పైగా అక్కినేని కళాశాల చలనచిత్ర విద్యలో ముందంజలో ఉంది. తరువాతి తరం ఫిలింమేక‌ర్స్ ని ఇది రూపొందిస్తుంది. ఈ ప్రోత్సాహ‌క కార్య‌క్ర‌మంలో భాగంగా ఛాయాచిత్రంలో అక్కినేని అమల - నాగార్జున, విశ్వనాథ్ గారి కుటుంబం నాగేంద్ర, లక్ష్మి, ప్రణవ్ ఉన్నారు.