యంగ్ ఏజ్‌లో నాటి మేటి స్టార్లను చూశారా?
ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్ ఉత్సవాల్ని ప్రతియేటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 May 2025 5:16 AMప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్ ఉత్సవాల్ని ప్రతియేటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 70 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు విజయవంతంగా నడుస్తున్నాయి. అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది సినీ రంగ ప్రముఖులకు ఈ పురస్కారాల్ని అందజేస్తున్నారు. కన్నులపండుగగా సాగే ఇలాంటి ఉత్సవాలకు నాటి మేటి తారలు నేటితరం స్టార్లతో కలిసి వేదికలకు విచ్చేస్తుండడం క్లాసిక్ డే స్టార్స్ మెమరీ లేన్ లోకి వెళ్లడం చూస్తున్నదే.
అయితే క్లాసిక్ డేలో నాటి మేటి తారలు ఫిలింఫేర్ ఉత్సవాల్లో సందడి చేస్తే ఎలా ఉంటుందో వీక్షించేందుకు ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల్లో అందుబాటులోకి వచ్చింది. ఫేస్ బుక్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో 27వ వార్షిక ఫిలింఫేర్ అవార్డ్స్ కి సంబంధించినది. 43 సంవత్సరాల క్రితం నాటి ఉత్సవానికి సంబంధించిన ఈ వీడియోలో ఇటు సౌత్ స్టార్లు, అటు నార్త్ స్టార్లు సందడి చేసారు. స్టార్లు వారి యంగ్ ఏజ్ లో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో కమల్ హాసన్, శోభన్ బాబు, జీతేంద్ర, శశికపూర్ ఎంతో స్మార్ట్ గా ఉల్లాసంగా కనిపించారు.
ఈ ఉత్సవాల్లో నటి రాధిక ఇంటర్వ్యూవర్ గా ప్రతి ఒక్కరినీ ప్రశ్నలు అడుగుతూ కనిపించారు. ఓవైపు మైక్ లో ప్రకటనలు జరుగుతుంటే స్టార్లు విచ్చేస్తున్నారు. హోస్ట్ కం యాంకర్ వరుసగా ఈ పేర్లను అనౌన్స్ చేసారు. కమల్ హాసన్, కైకాల సత్యనారాయణ, జెమినీ గణేషన్, శశికపూర్, జీతేంద్ర, శ్రీవిద్య, ఆమోల్ పాలేకర్, చిత్ర, రఫీ, శోభన్ బాబు, విజయన్, జరీనా వహబ్, గ్రేట్ సౌత్ డైరెక్టర్స్ భారతీరాజా, భరతన్, దొరై, మౌసమి చటర్జీ, జయలలిత, సుధాకర్, రేఖ, అంబిక, షావుకారు జానకి, జయసుధ, జయచిత్ర, రోజా రమణి, కే.ఆర్ విజయ, మహేంద్రన్, షీలా, లత, సుజాత, సత్యకళ ఇలా సెలబ్రిటీలంతా ఫిలింఫేర్ ఉత్సవాలకు అటెండయ్యారు. చారు హాసన్ తన కుమార్తె సుహాసినితో పాటు అక్కడ కనిపించారు.