ఒక్క సినిమా కోసమే బంద్ కరెక్ట్ కాదు: దామోదర ప్రసాద్
ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియాకు వెళ్లడించారు.
By: Tupaki Desk | 24 May 2025 2:52 PM ISTఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్‌కు పిలుపునివ్వడంతో చాలా వరకు పెద్ద సినిమాల రిలీజ్‌లు ఇబ్బందికరంగా మారడం తెలిసిందే. దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన ఫిల్మ్ ఛాంబర్ జూన్ 1న థియేటర్ల బంద్ అంటూ ఏమీ ఉండదని తాజాగా ప్రకటించింది. ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ విధానాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో శనివారం ఫిల్మ్ ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియాకు వెళ్లడించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కేవలం ఒకే ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నాం అనడం కరెక్ట్ కాదు. కొన్ని వార్తలు బిజినెస్‌ను దెబ్బతీస్తాయి. చిత్ర పరిశ్రమలో వంద సమస్యలు ఉన్నాయి. అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి.
వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ రావాలి. థియేటర్ల పర్సంటేజ్ విషయమై గత కొన్నేళ్లుగా ఎలాంటి చర్చ జరగలేదు. ప్రస్తుతం జరుగుతోంది. తర్వాత రోడ్‌మ్యాప్ ఏంటనేది నిర్ణయిస్తాం. మూడు సెక్టార్ల నుంచి కమిటీ వేస్తున్నాం. నిర్ణిత సమయంలోగా సమస్యలు పరిష్కరించుకుంటాం. ఈ నెల 30న జరిగే సమావేశంలో కమిటీ ఎవరనేది నిర్ణయించుకుంటాం`అన్నారు.
అయితే దామోదర ప్రసాద్ `కేవలం ఒకే ఒక్క సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నాం అనడం కరెక్ట్ కాదు` అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆయన చెప్పింది పవన్ కల్యాణ్ `హరి హర వీరమల్లు` గురించే అని అంతా కామెంట్‌లు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేయడం వల్లే థియేటర్ల బంద్‌కు ఎగ్జిబిటర్లు పిలుపునిచ్చారని ప్రచారం జరుగుతున్న వేళ దామోదర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధాన చర్చగా మారడం గమనార్హం.
