Begin typing your search above and press return to search.

'ఫైటర్' ఆశలన్నీ దాని పైనే?

ఎలాగైనా ట్రైలర్ తో ఫైటర్ పై ఆడియన్స్ లో అంచనాలను పెంచాలని చూస్తున్నారు. సినిమా రిలీజ్ కి మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది.

By:  Tupaki Desk   |   7 Jan 2024 10:30 AM GMT
ఫైటర్ ఆశలన్నీ దాని పైనే?
X

బాలీవుడ్ డైరెక్టర్, వార్ మూవీ ఫేమ్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఏరియల్ యాక్షన్ డ్రామా 'ఫైటర్'. బ్యాంగ్ బ్యాంగ్, వార్, వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ - హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో 'ఫైటర్' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది.

సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేశారు. అయితే ఆడియన్స్ నుంచి ఈ ప్రమోషనల్ కంటెంట్ అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ ని రాబట్టలేకపోయింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతున్న సినిమాపై ఆడియన్స్ లో ఎలాంటి హైట్ క్రియేట్ చేయలేకపోయారు మేకర్స్. దీంతో మూవీ టీం ఆశలన్నీ ట్రైలర్ పైనే ఉన్నాయి.

ఎలాగైనా ట్రైలర్ తో ఫైటర్ పై ఆడియన్స్ లో అంచనాలను పెంచాలని చూస్తున్నారు. సినిమా రిలీజ్ కి మరో మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. 'పఠాన్' వంటి వెయ్యికోట్ల బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన సిద్ధార్థ ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం, హృతిక్ రోషన్ - దీపిక పదుకొనే కాంబినేషన్ కి భారీ క్రేజ్ ఉండటంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి.

రిపబ్లిక్ వీకెండ్ లో సినిమా రిలీజ్ అవుతుండడంతో కేవలం ఇండియాలోనే రూ.50 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని అంతా భావించారు. కానీ సినిమాపై ఆడియన్స్ లో బజ్ క్రియేట్ మేకర్స్ విఫలమయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు. దానికి తోడు సంగీతం కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. బాలీవుడ్ ప్రేక్షకులు మునుపట్ల యాక్షన్ డ్రామాల పట్ల ఆసక్తి చూపించడం లేదు.

అందుకే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో 'ఫైటర్' మూవీ ఇండియా వైడ్ గా రూ.30 కోట్ల నెట్ కలెక్ట్ చేయడం కూడా కష్టంగానే కనిపిస్తుంది. ఒకవేళ ట్రైలర్ కనుక ఆడియన్స్ ని ఆకట్టుకుంటే బాక్స్ ఆఫీస్ వద్ద కొంతవరకు మ్యాజిక్ ఫిగర్స్ ని ఆశించవచ్చు. జనవరి 12న ఫైటర్ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.