Begin typing your search above and press return to search.

అయ్యో... ఆ పాట యూట్యూబ్‌ కే పరిమితం

ఇక ఈ సినిమాకి విపరీతమైన బజ్ క్రియేట్‌ అవ్వడంలో ప్రధాన పాత్ర పోషించిన మాస్ సాంగ్‌ ఇష్క్‌ జైసా కుచ్‌.

By:  Tupaki Desk   |   26 Jan 2024 6:14 AM GMT
అయ్యో... ఆ పాట యూట్యూబ్‌ కే పరిమితం
X

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌, దీపిక పదుకునే జంటగా సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌ తో రూపొందిన 'ఫైటర్‌' సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా నేడు విడుదల అయ్యింది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. రివ్యూలు కూడా సో సో అన్నట్లుగానే ఉన్నాయి.

ఇక ఈ సినిమాకి విపరీతమైన బజ్ క్రియేట్‌ అవ్వడంలో ప్రధాన పాత్ర పోషించిన మాస్ సాంగ్‌ ఇష్క్‌ జైసా కుచ్‌. ఈ పాటలో దీపిక అందాల ఆరబోతకు యూట్యూబ్‌ లోనే రికార్డులు నమోదు అయ్యాయి. ఇక సినిమాలో ఉంటే కచ్చితంగా మరో లెవల్‌ అన్నట్లుగా సినిమా ఉండటం ఖాయం అని అంతా అనుకున్నారు.

సినిమాలో ఆ పాట ఉంటుందని చాలా మంది ఆశించారు. కానీ ఆ పాట కోసం ఎదురు చూస్తున్న వారికి థియేటర్ లో నిరాశే ఎదురయ్యింది. సెన్సార్‌ సమయంలో పాటను తొలగించారని తెలిసి అంతా కూడా షాక్ అవుతున్నారు. అయ్యో అంటూ ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

సీరియస్ గా సాగే ఎయిర్ ఫోర్స్ కథ లో ఇలాంటి మాస్ పాట వల్ల స్క్రీన్‌ప్లే గతి తప్పుతుందనే ఉద్దేశ్యంతో పాటను తొలగించినట్లు గా సమాచారం అందుతోంది. ఎయిర్‌ ఫోర్స్ అధికారిని సినిమాలో అలా చూపించడం కూడా సరైనది కాదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దేశ భక్తి కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమాలో అలాంటి మాస్ అందాల ఆరబోత పాట ఉండటం అవసరం లేదు అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు కూడా భావించి ఉంటారు. అందుకే ఆ మసాలా పాటను కేవలం యూట్యూబ్‌ కే పరిమితం చేసి సినిమాలో లేకుండా చేశారని తెలుస్తోంది. ప్రేక్షకులు కొందరు పాట లేకపోవడం మంచిదే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.