Begin typing your search above and press return to search.

'ఫైటర్'.. ఓపెనింగ్స్ తోనే బిగ్ షాక్

బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన 'ఫైటర్' మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Jan 2024 8:33 AM GMT
ఫైటర్.. ఓపెనింగ్స్ తోనే బిగ్ షాక్
X

బాలీవుడ్ అగ్ర హీరో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన 'ఫైటర్' మూవీ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి థియేటర్స్ లో విడుదలైన మొదటి బడా మూవీ ఇదే. కానీ అందుకు తగ్గట్లు మేకర్స్ ఆడియన్స్ లో రిలీజ్ కు ముందు సినిమాపై హైప్ ని క్రియేట్ చేయలేకపోయారు. సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయాయి.

అయితే మూవీ టీమ్ కంటెంట్ పై ఉన్న నమ్మకంతో మౌత్ టాక్ సినిమాకి ప్లస్ అవుతుందని ఆశించారు. రిలీజ్ కు ముందు ఫైటర్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు. అందుకు కారణం ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకోకపోవడమే. గురువారం మధ్యాహ్నం జస్ట్ 10% ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ లో ప్రదర్శితమైన ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు ఆడియన్స్ నుంచి కూడా సానుకూల స్పందన రాబట్టింది.

సాధారణంగా ఇలాంటి పెద్ద సినిమాలకు మార్నింగ్ షో పాజిటివ్ టాక్ వస్తే ఆ తర్వాత షోలకి ఆక్యుపెన్సి పెరుగుతూ ఉంటుంది. కానీ ఫైటర్ విషయంలో అలా జరగలేదు. సినిమాకి మంచి రివ్యూస్ ఉన్నా కూడా ఈవినింగ్, నైట్ షోలకి జస్ట్ 20% నుంచి 25% మాత్రమే ఆక్యుపెన్సి కనిపించింది. దాంతో 'ఫైటర్' ఇండియా వైడ్ గా 20 కోట్ల ఓపెనింగ్స్ కాబట్టి నిరాశపరిచింది.

నిజానికి ఫైటర్ మూవీని లాంగ్ వీకెండ్ చూసుకొని రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే నేషనల్ హాలిడే కావడంతో సినిమాకి రెండో రోజు అయిన ఆక్యుపెన్సి పెరగాలి. చివరికి అది కూడా జరగలేదంటే ఫైటర్ టీమ్ కి నిరాశ తప్పదు. ఏరియల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించారు.

బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ కీలకపాత్రలు పోషించారు. ఫస్ట్ ఇండియన్ ఏరియల్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. మేకర్స్ ఈ ఒక్క సినిమాతో ఆగకుండా ఓ ఫ్రాంచైజీనే చేశారు. ఈ ఫ్రాంచైజీ నుంచి మరికొన్ని సినిమాలురానున్నట్లు తెలుస్తోంది.