Begin typing your search above and press return to search.

హృతిక్‌తో దీపిక శ్రుతిమించిన‌ శృంగారం!

గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ - దీపిక ప‌దుకొనే జంట ప్ర‌స్తుతం భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'ఫైట‌ర్'లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Dec 2023 4:29 AM GMT
హృతిక్‌తో దీపిక శ్రుతిమించిన‌ శృంగారం!
X

గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ - దీపిక ప‌దుకొనే జంట ప్ర‌స్తుతం భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'ఫైట‌ర్'లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది. ఫైట‌ర్ ప్ర‌మోష‌న్స్ ఇప్ప‌టికే హీటెక్కిస్తున్నాయి. ఇందులో మొదటిసారి కలిసి కనిపించనున్న హృతిక్ - డీపీ ఘాటైన రొమాన్స్ తో చెల‌రేగిపోవ‌డం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రిలీజ్ చేసిన 'ఇష్క్ జైసా..' పాటలో ఈ జంట‌ స్కార్కింగ్ కెమిస్ట్రీ ఇంటర్నెట్‌ను మండిస్తోంది. ఈ రొమాంటిక్ సాంగ్ కొద్దిసేపటికే ఇంట‌ర్నెట్ లో వైరల్‌గా మారింది. ఘాటైన అద‌ర‌చుంబ‌నాలు, కౌగిలింత‌ల‌ దృశ్యాలను చూసిన అభిమానులు ప్రశాంతంగా ఉండలేని ప‌రిస్థితి. నెటిజ‌నులు ఈ జంట‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తూ జోష్ ని ప్ర‌దర్శిస్తున్నారు.


గ్రీక్ గాడ్ లుక్స్ తో పాటు, దీపికా పదుకొణె ఎలక్ట్రిఫైయింగ్ మోనోకినీ లుక్ హీట్ పెంచేస్తున్నాయి. ముఖ్యంగా దీపిక పెళ్ల‌యిన నటి. కానీ ఇటీవ‌ల చెల‌రేగి పెద్ద‌తెర కోసం స్టార్ హీరోల‌తో రొమాన్స్ చేస్తోంది. ఇక ఇష్క్ జైసా పాట వివ‌రంలోకి వెళితే.. హృతిక్ రోషన్ ఒక కొలను నుండి బయటకు వ‌స్తూ స్ట‌న్న‌ర్ గా క‌నిపిస్తున్నాడు. సర్ఫ్‌బోర్డ్‌ను మోస్తున్నప్పుడు అతడి గ్రీకువీరుడి రూపం టోన్డ్ అబ్స్ మ‌తులు చెడ‌గొడుతున్నాయి. ఇంత‌లోనే దీపిక బ్లాక్ మోనోకినిలో వేడిని పెంచింది. బీచ్ ఇసుకలో ఘాటైన శృంగార‌ భంగిమల‌తో ఈ జంట అగ్గి రాజేసింది. ఈ వీడియో గ్లింప్స్‌లో దీపిక -హృతిక్‌ బీచ్‌లో డ్యాన్స్ చేస్తూ.. ఒకరినొకరు కౌగిలించుకుంటూ, స్క్రీన్‌పై మంట‌లు పెట్టారు. దీపికా బ్లాక్ మోనోకినీ, మినీ స్కర్ట్‌తో, నీలిరంగు బాడీసూట్‌లో విభిన్న రూపాల‌తో అందరి కళ్లను త‌న‌వైపు తిప్పేసుకుంది.


సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఫైట‌ర్‌ చిత్రాన్ని 3డిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. సిధ్ తన చిత్రాన్ని మరపురాని థియేట్రికల్ అనుభవంగా మ‌లిచాడు. ఇది పెద్ద స్క్రీన్ అనుభవం కోసం రూపొందించిన వైమానిక యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ అడ్రినలిన్ థంపింగ్ ఫిల్మ్ ప్రపంచం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 జనవరి 25న ఫైటర్ 2D, 3D, IMAX 3Dలలో విడుదల కానుంది.