Begin typing your search above and press return to search.

ఓటీటీలో 'యానిమ‌ల్'పై 'ఫైట‌ర్' పైచేయి?

థియేట‌ర్ల‌లో ఫ్లాపైన 'ఫైట‌ర్' హిందీ మూవీ ఓటీటీలో అద్భుత ఆద‌ర‌ణ ద‌క్కించుకుంద‌ని రివీల్ చేసింది.

By:  Tupaki Desk   |   3 April 2024 7:54 AM GMT
ఓటీటీలో యానిమ‌ల్పై ఫైట‌ర్ పైచేయి?
X

వీక్ష‌ణలు.. వీక్ష‌ణ గంట‌ల ఆధారంగా రూపొందించే ఓటీటీ సినిమాల చార్ట్ తాజాగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన నిజాన్ని ఆవిష్క‌రించింది. థియేట‌ర్ల‌లో ఫ్లాపైన 'ఫైట‌ర్' హిందీ మూవీ ఓటీటీలో అద్భుత ఆద‌ర‌ణ ద‌క్కించుకుంద‌ని రివీల్ చేసింది.

25 మార్చి - 31 మార్చి 2024 వారానికి సంబంధించి తాజా నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో ఒకే ఒక్క భారతీయ చిత్రం ఉంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10 ర్యాంకింగ్స్ లో నాన్-ఇంగ్లీష్‌లో వరుసగా రెండవ వారం ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న ఏకైక భారతీయ చిత్రం 'ఫైటర్'. ఈ చిత్రం 6.5 మిలియన్ వీక్షణలతో .. 17.8 మిలియన్ వీక్షణ గంటలతో నెట్ ఫ్లిక్స్ టాప్ 10 సినిమాల జాబితాలో చోటును క‌లిగి ఉంది. యానిమ‌ల్ (హిందీ) 'మర్డర్ ముబారక్' (హిందీ).. అలాగే 'అన్వెషిప్పిన్ కండెతుమ్ (మలయాళం)' వంటి చిత్రాలు తాజా టాప్ 10 జాబితా నుండి నిష్క్రమించాయి.

యానిమ‌ల్ చిత్రం ఈ ఏడాది జ‌న‌వ‌రి లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. థియేట‌ర్ల నుంచి దాదాపు 900 కోట్లు వ‌సూలు చేసింది. కానీ 'ఫైట‌ర్' మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకుంది. వైమానిక ద‌ళ సాహ‌సాలు, యుద్ధం నేప‌థ్యంలో రూపొందించిన ఈ ప్ర‌త్యేక చిత్రం ఫ‌లితాన్ని దర్శ‌క‌నిర్మాతలు జీర్ణించుకోలేక‌పోయారు. ఇది బాక్సాఫీస్ వ‌ద్ద 300 కోట్ల వ‌సూళ్ల‌తో యావ‌రేజ్ గా నిలిచింది. ఈ చిత్రానికి వార్, ప‌ఠాన్ చిత్రాల రూప‌క‌ర్త సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.