Begin typing your search above and press return to search.

`ఫైట‌ర్‌`లో ఘాటు ఎక్కువైంది.. సెన్సార్ క‌ట్స్!

2024 లో మోస్ట్ అవైటెడ్ మూవీగా, మొదటి పెద్ద విడుదలగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది- ఫైటర్. ఈ వారంలో విడుదలకు సిద్ధంగా ఉంది.

By:  Tupaki Desk   |   22 Jan 2024 1:30 AM GMT
`ఫైట‌ర్‌`లో ఘాటు ఎక్కువైంది.. సెన్సార్ క‌ట్స్!
X

2024 లో మోస్ట్ అవైటెడ్ మూవీగా, మొదటి పెద్ద విడుదలగా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది- ఫైటర్. ఈ వారంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాని వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా వేచి చూస్తున్నారు. శుక్రవారం రాత్రి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించ‌గా, ఇప్పటివరకు టిక్కెట్ల అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని క‌థ‌నాలొస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హృతిక్ రోషన్-దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్ కి కోతలు ఎక్కువే ప‌డ్డాయ‌నేది ఇంట‌ర్న‌ల్ సోర్స్ చెబుతున్న మాట‌.


కట్ లిస్ట్ ప్రకారం,.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సినిమాలో నాలుగు సవరణలు కోరింది. ముందుగా ధూమపాన వ్యతిరేక స్టాటిక్ సందేశాన్ని హిందీలో పేర్కొనమని అడిగారు. రెండవది సెన్సార్డ్ ప‌దాలు ఉప‌యోగించార‌ని రెండు డైలాగ్‌లలో ఉన్న వాటిని మ్యూట్ చేయ‌మ‌ని కోరారు. ఒకటి 53 నిమిషాలకు మరొకటి 1 గంట 18 నిమిషాలకు వ‌చ్చే డైలాగ్. దానిని మ్యూట్ చేసారు. మూడవదిగా యూత్ ని `లైంగికంగా ప్రేరేపించే విజువల్స్`ను తొల‌గించారు. ఈ 8 సెకన్ల విజువల్స్ బహుశా వేడెక్కించే షాట్‌లతో నింపేసారు. చివరగా టీవీ వార్తలు చ‌దివే సీన్ లో 25 సెకన్ల ఆడియో తొల‌గించారు. 23 సెకన్ల ఆడియోను తిరిగి మార్చారు. ఈ మార్పులు చేసిన తర్వాత జనవరి 19, శుక్రవారం నాడు ఫైటర్ నిర్మాతలకు U/A సర్టిఫికేట్ మంజూరు అయింది. సెన్సార్ సర్టిఫికేట్‌లో పేర్కొన్న విధంగా సినిమా నిడివి 166 నిమిషాలు. మరో మాటలో చెప్పాలంటే ఫైటర్ రన్ టైమ్ 2 గంటల 46 నిమిషాలు. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో ఫైటర్ విడుదల కానుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హాట్ సన్నివేశాల కారణంగా CBFC నుండి కోతలు త‌ప్ప‌లేదు. దీపికా పదుకొనే - దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌లకు ఇది వరుసగా రెండవసారి ఇలాంటి అనుభ‌వం అయింది. ఇంత‌కుముందు ప‌ఠాన్ లోని `బేషారం` పాటలోని `బహుత్ టాంగ్ కియా` సాహిత్యంలో పిరుదుల క్లోజప్ షాట్, సైడ్ పోజ్ (పాక్షిక నగ్నత్వం) షాట్లు ..మ‌తి చెడే నృత్య‌ కదలికల విజువల్స్ ను తొల‌గించిన తర్వాత మాత్రమే CBFC స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. బేసారం రంగ్ నుంచి `రంగ్`ని తొల‌గించారు.