Begin typing your search above and press return to search.

బాలీవుడ్ 2024.. ఈ ఫస్ట్ బిగ్ మూవీ ఏం చేస్తుందో?

ఆ మూవీ జనవరి 25న రిలీజ్ అయ్యింది. మళ్ళీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అదే రోజున హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

By:  Tupaki Desk   |   21 Jan 2024 4:19 AM GMT
బాలీవుడ్ 2024.. ఈ ఫస్ట్ బిగ్ మూవీ ఏం చేస్తుందో?
X

బాలీవుడ్ కి గత ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా గొప్ప శుభారంభం ఇచ్చింది. ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకోవడంతో పాటు బాలీవుడ్ లో బిగ్ సక్సెస్ లలో ఒకటిగా నిలిచింది. ఆ మూవీ జనవరి 25న రిలీజ్ అయ్యింది. మళ్ళీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అదే రోజున హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

పఠాన్ తరహాలోనే ఈ సినిమా కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కింది. యాదృశ్చికం అయిన పఠాన్ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించగా ఇప్పుడు ఫైటర్ చిత్రంలో కూడా దీపికా పదుకునే హీరోయిన్ గా ఉంది. దీంతో సెంటిమెంట్ గా కూడా డేట్, హీరోయిన్ ఫైటర్ మూవీపైన ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తున్నాయి.

దానికి తోడు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హృతిక్ రోషన్ వార్ మూవీతో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ చేసి సూపర్ హిట్ కొట్టారు. మరల ఇప్పుడు ఫైటర్ తో మరో సాలిడ్ సక్సెస్ ని ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు. ఫైటర్ చిత్రంతో గ్రాండ్ ఆరంభం కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఎదురుచూస్తుంది. టాలీవుడ్ కి అయితే హనుమాన్ తో సూపర్ ఎంట్రీ 2024కి లభించింది.

పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా సత్తా చాటుతోంది. మరోసారి నార్త్ ఇండియాలో తెలుగు సినిమా జెండాని హనుమాన్ ఎగిరేలా చేస్తోంది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా 150 కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో బాలీవుడ్ నుంచి ఫైటర్ రిలీజ్ అవుతోంది. హృతిక్ రోషన్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.

ఈ నేపథ్యంలో తెలుగునాట ఫైటర్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ లో వెయ్యి కోట్లు కలెక్షన్స్ సొంతం చేసుకునే సత్తా ఉన్న హీరోలలో ఖాన్ త్రయం తర్వాత హృతిక్ రోషన్ ఉంటారు. అతని సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ మీద తెరకెక్కుతూ ఉంటాయి.