వాళ్ల ఛాన్సులను అందుకుని భలే సక్సెస్ అయ్యారే
ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్ల భానుమతిగా నటించి అందరినీ తన నటనతో ఫిదా చేసిన సాయి పల్లవికి ఆ సినిమా తర్వాత చాలా క్రేజ్ పెరిగింది.
By: Tupaki Desk | 17 Jun 2025 6:30 PMశేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఉప్పెన సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయనే విషయం స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఏ సినిమా అయినా హిట్ అయితే ముందు ఎక్కువ పేరు హీరోకే వస్తుంది. కానీ ఈ రెండు సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది. ఫిదా, ఉప్పెన సినిమాల తర్వాత ఆ సినిమాల్లో నటించిన హీరోయిన్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది.
ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్ల భానుమతిగా నటించి అందరినీ తన నటనతో ఫిదా చేసిన సాయి పల్లవికి ఆ సినిమా తర్వాత చాలా క్రేజ్ పెరిగింది. అంతేకాదు, ఆ సినిమాలో సాయి పల్లవి డ్యాన్సులకు కూడా అందరూ పడిపోయారు. ఫిదా సినిమాతోనే సాయి పల్లవి యాక్టింగ్, డ్యాన్సింగ్ రేంజ్ ఏంటనేది అందరికీ తెలిసింది. ఇక ఉప్పెన సినిమాలో బేబమ్మగా నటించి అందరినీ ఆకట్టుకున్న కృతికి ఆ తర్వాత ఎంత డిమాండ్ ఏర్పడిందనేది కొత్తగా చెప్పనక్కర్లేదు.
దీంతో పాటూ ఈ రెండు సినిమాలకు సంబంధించి మరో విషయంలో కూడా సారూప్యత ఉంది. ఫిదా సినిమాలో హీరోగా వరుణ్ తేజ్ నటించగా, ఉప్పెన సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించాడు. వాస్తవానికి ఈ రెండు సినిమాల కోసం ముందు అనుకున్న హీరోలు వీళ్లు కాదనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఫిదా కథను మొదట శేఖర్ కమ్ముల మహేష్ బాబు కోసం అనుకుని ఆయనకు నెరేట్ కూడా చేశాడు. మహేష్ కు కూడా ఫిదా కథ బాగా నచ్చింది. కానీ వేరే కమిట్‌మెంట్స్ వల్ల డేట్స్ కుదరకపోవడంతో మహేష్ ఈ సినిమా చేయలేకపోయాడు. మహేష్ కోసం వెయిట్ చేసేంత టైమ్ శేఖర్ దగ్గర లేకపోవడంతో వరుణ్ తేజ్ తో ఫిదాని తీసి సూపర్ హిట్ అందుకున్నాడు.
ఉప్పెన సినిమాను కూడా బుచ్చిబాబు మొదటిగా వేరే హీరోతో తీయాలనుకున్నాడట. కథ రాసుకునే టైమ్ లోనే హీరో కోసం ట్రై చేసిన బుచ్చిబాబు, ఈ కథకు విజయ్ దేవరకొండ అయితే బావుండానుకున్నాడట. కానీ అప్పుడే అర్జున్ రెడ్డితో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ తో ఇలాంటి లవ్ స్టోరీ చేయడం కరెక్ట్ కాదనుకుని, విజయ్ లాంటి లుక్స్ ఉన్న హీరోనే కావాలనుకుని వెతుకుతున్న టైమ్ లో వైష్ణవ్ తేజ్ ఫోటోను సోషల్ మీడియాలో చూసి అతనే ఉప్పెనలో హీరో అని ఫిక్స్ అయ్యాడట బుచ్చిబాబు. మొత్తానికి వేరే హీరోలు చేయాలనుకున్న సినిమా ఛాన్సులను కొట్టేసి ఆ సినిమాలతో మంచి హిట్లు అందుకున్నారు వరుణ్, వైష్ణవ్.