వాళ్లిద్దరు తంగంలా ఇబ్బంది పడుతున్నారా?
ఒకప్పుడు హీరోయిన్ అంటే పాటలకు...అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం. పాత్ర పరంగా హీరోయిన్ కు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు.
By: Tupaki Desk | 6 May 2025 9:00 AM ISTఒకప్పుడు హీరోయిన్ అంటే పాటలకు...అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం. పాత్ర పరంగా హీరోయిన్ కు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ నేడు ట్రెండ్ మారింది. హీరో పాత్రతో పాటు హీరోయిన్ పాత్ర కూడా తెరపై బలంగా కనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో హీరోపాత్రను సైతం డామినేట్ చేసే స్థాయిలో హీరో యిన్ రోల్ డిజైన్ చేస్తున్నారు రైటర్లు. కానీ ఇలా చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. తెలుగులో పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత హీరోయిన్ పాత్రకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో `దేవర`తో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీకపూర్ పరిచయం అవుతుందంటే బోలె డంత హైప్ క్రియేట్ అయింది. పైగా కొరటాల హీరోయిన్ పాత్రలను ఎంతో బలంగా ఆవిష్కరించగల మేకర్. కానీ దేవరలో జాన్వీ తంగ పాత్రలో అభిమానుల్ని తీవ్ర నిరాశనే మిగిల్చిన సంగతి తెలిసిందే. ఆమె పాత్రకు ఏమాత్రం స్కోప్ లేకుండా చేసారు. చెప్పుకోవడానికి దేవర డెబ్యూ చిత్రం తప్ప అందులో జాన్వీ నటనకు ఆస్కారం ఎక్కడా కనిపించలేదు.
దీంతో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కుంది. తాజాగా ఇదే పరిస్థితిలో మరో ఇద్దరు భామలకు కనిపిస్తున్నారు. ముంబై బ్యూటీ పూజాహెగ్డే `రెట్రో` సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఎంతో ప్రయత్నించింది. కానీ ఆ సినిమా ఫెయిలైంది. మరి నటిగానైనా అలరించిందా? అంటే అందులో ఆమె పాత్రకు ఏమాత్రం స్కోప్ లేదు. పేరుకే హీరోయిన్ తప్ప సూర్యనే హైలైట్ అయ్యాడు. అలా పూజాహెగ్డే కంబ్యాక్ లో మర్చిపోలేని పంచ్ పడింది.
అలాగే కన్నడ బ్యూటీ శ్రీనిధి ఇటీవల రిలీజ్ అయిన `హిట్ 3`లో నటించిన సంగతి తెలిసిందే. సినిమా హిట్ అయినా శ్రీనిధి పాత్ర అంత బలంగా తీర్చిదిద్దలేదు. ఆ పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నా ఆ ఛాన్స్ తీసుకోలేదు. దీంతో ఆ బ్యూటీకి మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. అంతకు ముందు కేజీఎఫ్ తోనూ అదే పరిస్థితి. చెప్పుకోవడానికి పాన్ ఇండియాలో ఓసంచనల చిత్రం. కానీ శ్రీనిధి పాత్రకు ఏమాత్రం స్కోప్ లేని సంగతి తెలిసిందే. ఇలా శ్రీనిధి, పూజాహెగ్డే లు తంగను తలపించారు.
