ఇండియా - పాక్ వివాదం... ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
ఇండియా - పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే. రెండు దేశాల బోర్డర్ వద్ద అత్యంత హై టెన్షన్ వాతావరణం ఉన్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 5 May 2025 8:05 AMఇండియా - పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే. రెండు దేశాల బోర్డర్ వద్ద అత్యంత హై టెన్షన్ వాతావరణం ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు దాదాపుగా కట్ అయ్యాయి. ఇండియాలో ఉంటున్న పాకిస్తానీలను పంపించారు. అందుకోసం అన్ని రకాల వీసాలను ఇండియా రద్దు చేసింది. ఇప్పటికే వేలాది మంది పాకిస్తానీలు ఇండియా వదిలి వెళ్లి పోయారు. పాకిస్తాన్‌తో ఆర్థిక పరమైన వ్యాపారాలను సైతం పూర్తిగా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా జనాలు తీవ్ర ఆగ్రహంతో ఊగి పోతున్నారు. ఇలాంటి సమయంలో సెలబ్రెటీలు ఈ విషయం గురించి మాట్లాడితే వైరల్ అవుతోంది.
ఇండియన్ సినిమాలు పాకిస్తాన్‌లో సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే పాకిస్తాన్‌కి చెందిన ప్రముఖ నటుల సినిమలు ఇండియాలో విడుదల అవుతూ ఉంటాయి. పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబిర్ గులాల్ సినిమాను ఇండియాలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేయగా బ్యాన్ చేసిన విషయం తెల్సిందే. సినిమా ఇండస్ట్రీపై కూడా ప్రస్తుత పరిస్థితులు ప్రభావం చూపిస్తున్నాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్‌తో పూర్తి స్థాయిలో తెగతెంపులు చేసుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇండియన్ సినిమాలను సైతం ఇక మీదట పాకిస్తాన్‌లో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు.
పాకిస్తాన్ కి చెందిన నటుడు ఫవాద్ ఖాన్ నటించిన అబిర్ గులాల్ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడంను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తప్పుబడుతున్నాడు. సినిమాలపై బ్యాన్ విధించడం అనేది కరెక్ట్ నిర్ణయం కాదని అన్నాడు. బూతు సినిమాలు తప్ప మరే సినిమాలను బ్యాన్ చేసే హక్కు లేదని, ప్రతి దేశంలో అన్ని దేశాల సినిమాలు ఆడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియాలో పాకిస్తాన్ సినిమాలను బ్యాన్ చేయడంను తప్పుబడుతూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి వివాదాలకు సెలబ్రిటీలు దూరంగా ఉంటూ, మౌనంగా చూస్తూ ఉంటారు. కానీ ప్రకాష్ రాజ్ వాయిస్ లేపడం తో హాట్ టాపిక్ అయింది.
ప్రకాష్ రాజ్ తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్ సినిమాలను సమర్ధిస్తూ బ్యాన్‌ను వ్యతిరేకించి మాట్లాడిన నువ్వు ఇండియాకు వ్యతిరేకివి అంటూ పలువురు ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రేక్షకులు ఆ సినిమాను చూడాలో లేదో నిర్ణయించుకుంటారు, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను కూడా చాలా మంది తప్పుబడుతున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం ఉండేది ఎందుకు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ సమర్ధించుకుంటూ వాటిపై నిలబడుతున్నట్లు చెప్పుకొచ్చాడు.