పహల్గాం దాడితో ఆ బాలీవుడ్ మూవీ బ్యాన్
మంగళవారం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 28 పైగా అమాయకులైన టూరిస్టులు చనిపోవడం యావత్ భారతదేశంలో సెగలు రేపుతోంది.
By: Tupaki Desk | 23 April 2025 9:31 AMమంగళవారం జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 28 పైగా అమాయకులైన టూరిస్టులు చనిపోవడం యావత్ భారతదేశంలో సెగలు రేపుతోంది. ఈ విషయంపై ప్రతీ భారతీయుడూ ఎంతో ఆగ్రహంగా ఉన్నారు. పర్యాటక ప్రాంతమైన పహల్గామ్ ను చూడాలని ఎందరో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే.
పర్యాటకులు అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుండగా ఉగ్రవాదులు దాడి చేసి వాళ్లను మతం అడిగి మరీ ప్రాణాలు తీసిన విధానం అందరిలో ఆగ్రహ జ్వాలలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనే వాదనలు దేశ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కు సంబంధించిన చాలా విషయాలపై ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి.
అయితే ఈ ఎఫెక్ట్ ఇప్పుడో పాకిస్తాన్ సినిమాపై పడుతుంది. ఆ సినిమానే అబిర్ గులాల్. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ దుర్ఘటనకు రియాక్ట్ అవుతూ అందరూ అబిర్ గులాల్ సినిమాను బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దానికి కారణం ఇందులో పాకిస్తానీ నటుడైన ఫవర్ ఖాన్ నటిస్తుండమే. ఫవర్ ఖాన్ హీరోగా, వాణి కపూర్ హీరోయిన్ గా అబిర్ గులాల్ తెరకెక్కింది.
ఆర్తి ఎస్ బాగ్ది డైరెక్టర్ గా తెరకెక్కిన ఈ సినిమాను రిలీజ్ కాకుండా బ్యాన్ చేయాలని, పాకిస్తానీ నటుడున్న సినిమాను చూడబోమని అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. అయితే ఫవర్ ఖాన్ కు ఇదేమీ ఇక్కడ మొదటి సినిమా కాదు. 2014లోనే ఆయన ఖూబ్సూరత్ తో బాలీవుడ్ లోకి ఎంటరయ్యాడు.
ఆపై 2016లో కపూర్ అండ్ సన్స్, ఏ దిల్ హై ముష్కిల్ లో కనిపించాడు. ఆ తర్వాత నుంచి పాకిస్తాన్ లోనే ఉంటూ పలు సినిమాల్లో నటించి ఇప్పుడు అబీర్ గులాల్ సినిమాతో బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను అసలు రిలీజ్ చేయొద్దంటూ, బ్యాన్ చేయమని కోరుతూ నెటిజన్లు ఈ విషయాన్ని హ్యాష్‌ట్యాగులతో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం అబీర్ గులాల్ ను వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఎటాక్స్ పై పాకిస్తానీ నటుడు ఫవర్ ఖాన్ రెస్పాండ్ అవకపోతే ఆయనపై, ఆయన సినిమాపై మరింత వ్యతిరేకత రావడం మాత్రం గ్యారెంటీ.