Begin typing your search above and press return to search.

చీరందంలో ష‌నా షేక్ వైబ్రేష‌న్స్!

బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా ష‌నా షేక్ సుప‌రిచిత‌మే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ 'దంగ‌ల్' సినిమాతో దేశ‌మంతా ఫేమ‌స్ అయింది

By:  Tupaki Desk   |   26 Nov 2023 11:30 PM GMT
చీరందంలో ష‌నా షేక్ వైబ్రేష‌న్స్!
X

బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా ష‌నా షేక్ సుప‌రిచిత‌మే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ 'దంగ‌ల్' సినిమాతో దేశ‌మంతా ఫేమ‌స్ అయింది. ఆ ఒక్క పాత్ర ఫాతిమా బాలీవుడ్ కెరీర్ నే మార్చేసింది. గీతా ఫోగాట్ పాత్ర‌లో అమ్మ‌డు అభినయించిన తీరు గొప్ప పేరును తీసుకొచ్చింది. ఆ పాత్ర‌లో ఫాతిమా సెటిల్డ్ పెర్పార్మెన్స్ ఎన్నో ప్ర‌శంస‌లు తెచ్చి పెట్టింది. ఆ సినిమా త‌ర్వాత న‌టిగా బిజీ అయింది.




అంత‌కుముందు మెయిన్ లీడ్స్ లో కొన్ని సినిమాలు చేసినా..ఏ సినిమా తీసుకురాని గుర్తింపు దంగ‌ల్ తీసుకొచ్చింది. ఆ ర‌కంగా ఫాతిమ కెరీర్ లో దంగ‌ల్ ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. ఇప్ప‌టికీ అదే క్రేజ్ తో అవ‌కాశాలు అందుకుంటుంది. కానీ ఆ రేంజ్ స‌క్సెస్ మాత్రం రావ‌డం లేదు. 'థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్' ..'లుడో'.. 'సురాజ్ పే మంగ‌ల్ బారీ'.. 'అజీబ్ ద‌స్తాన్స్'..'థార్'..'ధ‌క్ ధ‌క్' లాంటి సినిమాలు చేసినా దంగ‌ల్ ని క‌నీసం ట‌చ్ కూడా చేయ‌లేక‌పోయాయి.

ఇక వీట‌న్నింక‌టే ముందే టాలీవుడ్ లో 'నువ్వు నేను ఒక‌ట‌వుదాం' అనే చిత్రంలో న‌టించింది. ఆ సినిమా స‌క్సెస్ అయి తెలుగులో అవ‌కాశాలు వ‌చ్చి ఉంటే ఇక్క‌డే ఉండేదేమో. కానీ అలా జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టే అటుపై 'దంగ‌ల్' లో ఛాన్స్ అందుకుంది. ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా యాక్టివ్ గా ఉండ‌దు. అప్పుడ‌ప్పుడు ఫోటోలు పోస్ట్ చేసినా ప‌ద్ద‌తైన ఫోటోల‌తోనే మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తుంది. అమ్మ‌డు గ్లామ‌ర్ షోకి దూరంగా ఉంటుంది. చాలా రేర్ గానే స్కిన్ షో చేస్తుంది.

తాజాగా ఫాతిమా ఓ న్యూలుక్ తో నెటి జ‌నుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్క‌డిలా క్లోజ్ షాట్ లో చీరందంలో ఆక‌ర్షిస్తుంది. మార్వాడీ బ్యూటీ లా ముస్తాబైన వైనం ఆక‌ట్టుకుంటుంది. గోల్డ్ క‌ల‌ర్ సారీ..మ్యాచింగ్ షోల్డెర్ లెజ్ బ్లౌజు సొగ‌సైన ఫోజులిచ్చింది. ఇక చెవుల‌కు ఎంపిక చేసుకున్న బుల‌కాలు మాత్రం సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. త్వ‌ర‌లో అమ్మ‌డు 'షామ్ బ‌హ‌దూర్' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.