Begin typing your search above and press return to search.

స్టార్ హీరో ఎఫైర్ కాక‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ

ఇలాంటి క‌థ‌నాల న‌డుమ ఫాతిమా స‌నా షేక్ తో సొంత నిర్మాణ సంస్థ‌లో అమీర్ ఖాన్ సినిమా చేస్తుండ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 5:17 AM GMT
స్టార్ హీరో ఎఫైర్ కాక‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ
X

ప్ర‌ముఖ హీరో భార్య‌కు విడాకులిచ్చి, ఆ త‌ర్వాత త‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ని పెళ్లాడారు. ఈ బంధం కొన్నేళ్ల పాటు సాగింది. కానీ ఇది కూడా చివ‌రికి బ్రేక‌ప్ అయింది. అయితే ఈ బ్రేక‌ప్ కి కార‌ణం త‌న సినిమాలో న‌టించిన ఒక యంగ్ హీరోయిన్. బ్రేక‌ప్ త‌ర్వాతా కొత్త ఎఫైర్ హాట్ టాపిక్ అయింది.

యువ‌న‌టితో ఎఫైర్ సాగిస్తున్న స‌ద‌రు స్టార్ హీరోపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయినా అవేవీ అత‌డిని అంత‌గా ప్ర‌భావితం చేసిన‌ట్టు లేదు. ఇప్పుడు త‌న సొంత నిర్మాణ సంస్థ‌లో ఆమెకు క‌థానాయిక‌గా అవ‌కాశం ఇచ్చారు. దీంతో మ‌రోసారి మీడియా స‌హా నెటినుల్లో రుబాబ్ స్టార్ట‌యింది. అత‌డు మార‌డు అంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదంతా బాలీవుడ్ కి చెందిన ప్ర‌ముఖ హీరో అమీర్ ఖాన్ గురించే. దంగల్ సినిమాతో అమీర్ ఖాన్ సంచలనం సృష్టించాడు. ఆ సినిమాలో ఫాతిమా సనా షేక్ తన కూతురిలో ఒకరిగా నటించి మెప్పించింది.


అయితే అదే సమయంలో అమీర్ ఖాన్‌తో ఎఫైర్ పెట్టుకుని వార్తల్లో నిలిచింది. అమీర్ తన రెండో భార్య కిరణ్‌రావుకు విడాకులు ఇచ్చినప్పుడు.. ఫాతిమా వల్లే విడాకులు తీసుకున్నాడని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అమీర్ - ఫాతిమా సాన్నిహిత్యానికి సంబంధించిన ప‌లు ఫోటోలు కూడా ఇంత‌కుముందు వైర‌ల్ అయ్యాయి.

ఇలాంటి క‌థ‌నాల న‌డుమ ఫాతిమా స‌నా షేక్ తో సొంత నిర్మాణ సంస్థ‌లో అమీర్ ఖాన్ సినిమా చేస్తుండ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ‌రోసారి ఆ ఇద్ద‌రి ఎఫైర్ గురించి మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇంత‌కీ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏం జ‌రుగుతోంది? అంటూ మీడియా ప్ర‌శ్నిస్తోంది. కిర‌ణ్ రావుకి విడాకులివ్వ‌క ముందే ఫాతిమాతో స‌హ‌జీవ‌నం అంటూ మ‌రోసారి క‌థ‌నాలు వేస్తోంది.

సీక్రెట్ సూపర్ స్టార్ -లాల్ సింగ్ చద్దా చిత్రాలకు దర్శకత్వం వహించిన అద్వైత్ చందన్ మ‌రోసారి అమీర్ ఖాన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తార‌ని తెలిసింది. ఈ నెల ప్రారంభంలో అమీర్ స్క్రిప్టుని లాక్ చేసారు. ఇత‌ర‌ పనులు సజావుగా సాగుతున్నాయి. ఈ విష‌యం బయటకు వచ్చినప్పటి నుండి అమీర్ - ఫాతిమా ఎఫైర్ గురించి మ‌ళ్లీ మీడియాలో క‌థ‌నాలు సంచ‌ల‌నంగా మారాయి.