తమన్నా ప్రియుడితో లింకప్ వార్తలపై నటి స్పందన
అదే సమయంలో తమన్నా నుంచి బ్రేకప్ అయిన నటుడు విజయ్ వర్మతో ఫాతిమా లింకప్ వార్తలు మొదలయ్యాయి.
By: Tupaki Desk | 26 Jun 2025 9:45 AM ISTఅమీర్ ఖాన్ 'దంగల్' చిత్రంతో ప్రపంచానికి తెలిసిన నటి ఫాతిమా సనా షేక్. అంతకుముందు ఓ తెలుగు చిత్రంతో తెరకు పరిచయమైనా ఎవరూ అంతగా గుర్తించలేదు. ముఖ్యంగా దంగల్ సినిమాలో నటించాక, అమీర్ తో ఫాతిమా ఎఫైర్ వార్తలు బాగా ఫేమస్ అయ్యేలా చేసాయి. అమీర్ ఖాన్ తో ఫాతిమా లింకప్ వార్తలు ఇటీవల అదృశ్యమయ్యాయి.
అదే సమయంలో తమన్నా నుంచి బ్రేకప్ అయిన నటుడు విజయ్ వర్మతో ఫాతిమా లింకప్ వార్తలు మొదలయ్యాయి. దీనికి కారణం ప్రస్తుతం ఈ జంట కొన్ని సినిమాలు, సిరీస్ లలో కలిసి పని చేస్తుండటమే. ఇటీవలే ఓ డిన్నర్ పార్టీ నుంచి వెళుతూ ఇద్దరూ హగ్ చేసుకున్న ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. విజయ్ వర్మతో సనా షేక్ డేటింగ్ లో ఉందంటూ వెంటనే పుకార్లు మొదలయ్యాయి.
అయితే ఈ వార్తలపై ఇప్పటివరకూ స్పందించని ఫాతిమా తాను నటించిన 'మెట్రో ఇన్ డినో' ప్రచార కార్యక్రమాల్లో స్పందించారు. తాను ఇంకా ఒంటరిగానే ఉన్నానని ధృవీకరించారు. ఇక ఒకరితో రిలేషన్ షిప్ లోకి వెళ్లాలంటే...ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు గౌరవించుకోవాలని అన్నారు. ఒకరి ఆలోచనలు, అభిప్రాయాలను వినే చోట సమస్యలు ఉండవని, ఇద్దరూ సమానంగా రాజీకి రావాలని కూడా సంబంధాలపై సనా షేక్ విశ్లేషించింది. భాగస్వామ్యంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోకుండా సంబంధం కోసం పని చేస్తారు. అదే విజయవంతమైన సంబంధానికి మార్గం అని భావిస్తున్నట్టు తెలిపారు.
ఫాతిమా తన ఆలోచనలకు సరిపోయే వ్యక్తిని కనుగొన్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఇలా అన్నారు. 'అచ్చే లడ్కే హై హాయ్ నై యార్... కోయి భీ నహీ హై (మేరీ లైఫ్ మే). ఫిల్మోన్ మే అచ్చే హోతే హై'' అని అన్నారు. ఫాతిమా నటించిన మెట్రో ఇన్ డినో జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 11న OTT ప్రీమియర్‌ని షెడ్యూల్ చేయనున్న ఆప్ జైసా కోయిలో R. మాధవన్‌తో కలిసి నటిస్తోంది. విజయ్ వర్మతో 'గుస్తాక్ ఇష్క్' చిత్రం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ సినిమా సెట్స్ లో వారి మధ్య సాన్నిహిత్యం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
