Begin typing your search above and press return to search.

సెల్ఫీ కోసం అభిమాని.. న‌టి ఓవ‌రాక్ష‌న్!

అభిమాని హీరోయిన్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. సెల్ఫీ కావాల‌న్నాడు. దానికి ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌ని న‌టి సెల్ఫీ కోసం ఫోజిస్తోంది.

By:  Tupaki Desk   |   30 March 2025 11:13 AM IST
సెల్ఫీ కోసం అభిమాని.. న‌టి ఓవ‌రాక్ష‌న్!
X

అభిమాని హీరోయిన్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. సెల్ఫీ కావాల‌న్నాడు. దానికి ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌ని న‌టి సెల్ఫీ కోసం ఫోజిస్తోంది. అయితే అత‌డి స్ప‌ర్శ‌.. అత‌డి శ్వాస‌ను ఇబ్బంది ఫీలైంది. ఇంకేం ఉంది.. అత‌డి నుంచి దూరం జ‌రిగింది. అత‌డినే త‌థేకంగా చూస్తూ సెల్ఫీ కోసం మ‌రీ ఇంత ద‌గ్గ‌రైపోతున్నాడేంటి? అన్న‌ట్టుగా పెట్టింది ఫేసు. నిజానికి ఆ అభిమాని ద‌గ్గ‌ర ఒక‌టే ఇంటెన్ష‌న్.. త‌న‌తో ద‌గ్గ‌ర‌గా సెల్ఫీ దిగాల‌ని. అంత‌కుమించి ఎలాంటి ఇంటెన్ష‌న్ క‌నిపించ‌డం లేదు ఆ ఫేస్ లో. ఏంటో కానీ, దంగ‌ల్ బ్యూటీ ఫాతిమా స‌నా షేక్ ఇబ్బందిని ఫీల‌వుతున్న ఫేస్ పెట్టింది. స్ట‌న్ అయిపోయి అత‌డినే చూస్తూ ఉండిపోవ‌డం కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఈ ఎపిసోడ్ లో అభిమాని ఎంతో స్మార్ట్ గా ఉన్నాడు. అందుకే స‌నా అలా త‌థేకంగా చూస్తోందంటూ నెటిజ‌నులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి స‌నా షేక్ త‌న‌కు ద‌గ్గ‌ర‌గా వ‌స్తున్న అభిమానిని చూసి కొంత జాగ్ర‌త్త ప‌డింది మిన‌హా ఈ ఎపిసోడ్ లో ఇంకేదీ లేదు. అభిమాని సెల్ఫీ దిగి గౌర‌వంగా అక్క‌డి నుంచి నిష్కృమించడం వీడియోలో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. అత‌డు బాగానే ఉన్నాడు.. ఈవిడే ఓవ‌రాక్టింగ్ చేస్తోంది! అంటూ ఒక నెటిజ‌న్ స‌నా షేక్ పై విరుచుకుప‌డ్డాడు.

స‌నా షేక్ పేరు చాలాకాలం పాటు అమీర్ ఖాన్ తో ముడిపెట్టి మీడియా క‌థ‌నాలు అల్లింది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఎఫైర్ న‌డుస్తోంద‌ని జాతీయ మీడియాలో క‌థనాలొచ్చాయి. కానీ కొంత కాలంగా స‌నా స్థ‌బ్ధుగా ఉంది. అమీర్ తో క‌లిసి క‌నిపించ‌లేదు. అమీర్ ఖాన్ ఇటీవ‌ల త‌న సొంత సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న గౌరీ స్ప్రాట్ అనే బిడ్డ త‌ల్లిని ప‌రిచ‌యం చేసి త‌న‌తో డేటింగ్ లో ఉన్నాన‌ని చెప్పాడు. ఈ ఎపిసోడ్ తో స‌నా షేక్ తో అత‌డి ఎఫైర్ కి ఎప్పుడో ముగింపు ప‌లికాడ‌ని ఫుల్ క్లారిటీ వ‌చ్చింది. స‌నా షేక్ ఇంత‌కుముందు అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ పెళ్లిలోను పెద్ద‌గా క‌నిపించ‌లేదు. చాలా విమ‌ర్శ‌ల త‌ర్వాత స‌నా షేక్ అత‌డికి దూర‌మైందని హిందీ మీడియాలో గుస‌గుస‌లు వినిపించాయి. స‌నా ప్ర‌స్తుతం మెట్రో ఇన్ డినో, ఉల్ జ‌లూల్ ఇష్క్, ఆప్ జైసా కోయీ లాంటి చిత్రాల్లో న‌టిస్తోంది.