'దంగల్' ఫేం ఫాతిమా ఆయిలీ మేకప్ లుక్
ఫాతిమా సనా షేక్ పరిచయం అవసరం లేదు. చైనాలో అత్యంత భారీ వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా దంగల్ రికార్డులకెక్కింది.
By: Tupaki Desk | 11 July 2025 1:00 PM ISTఫాతిమా సనా షేక్ పరిచయం అవసరం లేదు. చైనాలో అత్యంత భారీ వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా దంగల్ రికార్డులకెక్కింది. ఇండియాలో బాహుబలి 2 తర్వాత టాప్ 10 జాబితాలోను ఈ చిత్రం నిలిచింది. అయితే ఇలాంటి క్రేజీ చిత్రంలో అమీర్ ఖాన్ కి కుమార్తెగా నటించిన ఫాతిమా సనా షేక్, ఆ తర్వాత అతడితో ఎఫైర్ కారణంగా వార్తల్లో నిలిచింది.
అమీర్ ఖాన్ చాలా కాలానికి గౌరి స్ప్రాట్ అనే బెంగళూరు యువతిని పెళ్లాడేందుకు సిద్ధమవ్వడంతో ఫాతిమాతో ఎఫైర్ కథనాలకు బ్రేక్ పడింది. ఫాతిమా ఇటీవల పూర్తిగా తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టి ముందుకు సాగుతోంది. నటిగా తనను తాను మెరుగులు దిద్దుకుంటోంది. ఇటీవలే `మెట్రో ఇన్ డినో` చిత్రంలో ఫాతిమా నటనకు మంచి మార్కులే పడ్డాయి.
మెట్రో ఇన్ డినోకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా నటీనటుల ప్రదర్శనకు మంచి గుర్తింపు దక్కింది. ఇక ఇదే హుషారులో ఫాతిమా మీడియా గ్లేర్‌ని ఎదుర్కొంటోంది. నిరంతరం వరుస ఫోటోషూట్లతో వేడెక్కిస్తోంది. తాజాగా ఫాతిమా ఆయిలీ మేకప్ తో సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. ఈ కొత్త లుక్ చూడగానే ఫోటోగ్రాఫర్లు వెంబడించారు. వన్స్ మోర్ అంటూ స్నాప్స్ కోసం పోటీకి దిగారు. ఫాతిమా ఫోటోషూట్ కి అన్నివిధాలా సహకరించింది. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా దూసుకెళుతోంది.
