దంగల్ నటి లవ్ మ్యాటర్ రివీల్!
అయితే చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఫాతిమా.. తొలుత ఇష్క్ లో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన చాచి 420 చిత్రంలో యాక్ట్ చేసింది.
By: Tupaki Desk | 15 April 2025 7:44 PM ISTబ్లాక్ బస్టర్ హిట్ దంగల్ మూవీతో బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయిన ఆ నటి.. అంతకుముందు తెలుగులో కూడా నటించింది. రీసెంట్ గా తెలుగు నిర్మాతపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది.
ఇప్పుడు ఆ బ్యూటీ.. తన ప్రేమ వ్యవహారంపై ఓపెన్ అయింది! దీంతో ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్ట్.. ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. అయితే చీరలతో తనకు పూర్తి స్థాయి ప్రేమ ఉందని రాసుకొచ్చింది. అదిరిపోయే శారీలో దిగిన పిక్స్ షేర్ చేయగా.. ఇప్పుడు ఇన్ స్టాలో ఆమె ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
స్పెషల్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న అమ్మడు.. చీరలో ఇచ్చిన పోజులు వేరే లెవెల్ అని చెప్పాలి. ఒక్క ఫోటో ఓ రేంజ్ లో ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చీరలో అదిరిపోయారని చెబుతున్నారు. అందమే అసూయ పడేలా ఉన్నారని అంటున్నారు. శారీ లవ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇస్తూ లైక్స్ కొడుతూ సందడి చేస్తున్నారు.
ఇక కెరీర్ విషయానికొస్తే.. మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్షా జీవితం ఆధారంగా రూపొందిన వార్ డ్రామా సామ్ బహదూర్ మూవీతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఫాతిమా. ఇప్పుడు అనురాగ్ బసు దర్శకత్వం వహించిన మెట్రో ఇన్ డినోతో సందడి చేయనుందన్న విషయం అందరికీ తెలిసిందే.
ఫాతిమాతోపాటు ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, పంకజ్ త్రిపాఠి, కొంకణ సేన్ శర్మ, అలీ ఫజల్ తదితరులు నటిస్తున్న ఆ మూవీ జూలై 4వ తేదీన విడుదల కానుంది. అయితే మెట్రో ఇన్ డినో.. 2007లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన లైఫ్ ఇన్ ఏ మెట్రోకు సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఫాతిమా.. తొలుత ఇష్క్ లో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన చాచి 420 చిత్రంలో యాక్ట్ చేసింది. అనంతరం పలు సినిమాలు చేసిన ఆమె.. దంగల్ లో రెజ్లర్ గీతా ఫోగాట్ రోల్ పోషించి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు పలు ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుని దూసుకుపోతోంది ఫాతిమా.