బ్యాక్ గ్రౌండ్ లేని లేడీస్ ని ఇండస్ట్రీలో అలా చూస్తారు!
బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. అవమానాలు..హేళనలకు గురికావాల్సి వస్తుంది.
By: Tupaki Desk | 25 Jun 2025 9:15 PM ISTబ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వస్తే ఎలా ఉంటుందో తెలిసిందే. అవమానాలు..హేళనలకు గురికావాల్సి వస్తుంది. అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో ఎంతో మంది ఎన్నో రకాలు కామెంట్లు చేస్తుంటారు. ఇదంతా సక్సస్ అయ్యేంత వరకే. విజయం చెంత చేరిన తర్వాత అలా అవమానించిన వారే ముందుకొచ్చి దండ కట్టుకుని నుంచుంటారు. ఇది సక్సెస్ అయిన ప్రతీ ఒక్కరూ చెప్పే మాటే.
తాజాగా 'దంగల్' బ్యూటీ ఫాతిమా షనా షేక్ ఇండస్ట్రీలో తన అనుభవాలు చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు దంగల్ సినిమా కంటే ముందే తెలుగులో ఓసినిమా చేసింది. కానీ ఆ సినిమా గురించి ఎవరికీ తెలియదు. దంగల్ సక్సస్ అయిన తర్వాతే వెలుగులోకి వచ్చింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తనని సెకెండ్ గ్రేడ్ నటిలా చూసారంది. ఈ తేడా ఎలా తెలిసిందంటే? సహాయ పాత్రలు పోషించినప్పుడు ఒకలా...ప్రధాన పాత్రలు పోషించనిప్పుడు ఒకలా ట్రీట్ చేయడంతోనే ఈ వ్యత్యాసం తెలిసిందంది.
సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని మహిళా నటుల్ని అయితే సెకెండ్ గ్రేడ్ లా చూస్తారు. వాళ్లను చూసే విధానం కూడా ఏమాత్రం నచ్చదు. నేను అనుభవించిన ఆ బాధను ఎవరూ అనుభవించకూడదనుకుంటా. ఆ అనుభవాల నుంచి జూనియర్ ఆర్టిస్టుల పట్ల గౌరవంగా ఉంటాను. ఒక మనిషిని మనిషిలా కొందరు ఎందుకో చూడాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు. అందులోనూ సినిమా ఇండస్ట్రీలో అత్యంత దారు ణమైన పరిస్థితులుంటాయి.
ఇలాంటి పరిస్థితులుంటాయని సినిమాల్లోకి రాకముందు తెలియదు. తెలిస్తే వచ్చే దాన్ని కాదేమో` అని తెలిపింది. ఈ అమ్మడు 2015 లో `నువ్వు నేను ఒకటవుదాం` అనే తెలుగు సినిమా చేసింది. ఆ తర్వాత ఏడాది 'దంగల్' లో ఛాన్స్ రావడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడు బిజీ నటిగా మారిపోయింది.
