పిక్‌టాక్ : నల్ల చీర కట్టిన తెల్ల పిల్ల
తాజాగా మరోసారి ఫాతిమా సనా షేక్ తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఈసారి బ్లాక్ చీర కట్టిన ఫాతిమా చూపు తిప్పనివ్వడం లేదు.
By: Tupaki Desk | 9 July 2025 8:00 AM ISTచైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌లో 1997లోనే ఎంట్రీ ఇచ్చిన ఫాతిమా సనా షేక్ 'దంగల్'తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు దక్కించుకుంది. ఆమీర్ ఖాన్ కూతురు పాత్రలలో దంగల్‌లో కనిపించిన ఫాతిమా సనా షేక్ నటనతో మెప్పించింది. గీతా ఫోగట్ పాత్రకు ఫాతిమా సనా షేక్ చేసినట్లుగా మరే నటి న్యాయం చేసి ఉండక పోవచ్చు అనేది చాలా మంది అభిప్రాయం. దంగల్ సినిమాలో ఆమీర్ ఖాన్ కూతురు పాత్రలో నటించిన ఫాతిమా ఆ వెంటనే ఆయనకు జోడీగా హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఫాతిమా సనా షేక్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం మాత్రమే కాకుండా, బోల్డ్ పాత్రల్లో నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది.
రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. నెట్టింట ఈమె షేర్ చేసే ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఫాతిమా సనా షేక్ తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఈసారి బ్లాక్ చీర కట్టిన ఫాతిమా చూపు తిప్పనివ్వడం లేదు. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అని ఇప్పటికే పలు సార్లు నిరూపితం అయ్యింది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్‌లో ఆకట్టుకునే ఫాతిమా ఈసారి అంతకు మించి అన్నట్లుగా చీర కట్టులో కనిపిస్తుంది. ఫాతిమా సనా షేక్ నెట్టింట షేర్ చేసిన ఈ నల్ల చీర కట్టు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సింపుల్ అండ్ స్వీట్ లుక్‌లో ఫాతిమా సనా షేక్ ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. కొందరు హీరోయిన్స్ ఫోటో షూట్స్ చాలా హంగామాగా ఉంటాయి. కానీ ఫాతిమా సనా షేక్ ఫోటో షూట్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. అయినా కూడా వైరల్ కావడానికి ఆమె అందం కారణం. ఎలాంటి ఔట్ ఫిట్‌లో అయినా భలే అందంగా ఉందే అనిపించుకునే తరహా ఫిజిక్ ఫాతిమా సనా షేక్ ది అంటూ ఆమె అభిమానులు అంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో సినిమాల కంటే వివాదాలతో ఎక్కువగా వార్తల్లో ఉంటున్న ఫాతిమా సనా షేక్ ఇలా అప్పుడప్పుడు అందాల ఫోటోలతోనూ వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
1992లో ముంబైలో జన్మించిన ఫాతిమా ఫోటోగ్రఫీలో ప్రావిణ్యం సొంతం చేసుకుంది. న్యూరోలాజికల్ పరిస్థితులపై అవగాహన పెంచడం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. తాను ఎదుర్కొన్న మూర్చ జబ్బు గురించి అవగాహన పెంచడం లో ఫాతిమా సనా షేక్ కీలక పాత్ర పోషించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ తాను విమాన ప్రయాణ సమయంలో పలు సార్లు మూర్చ జబ్బుతో బాధ పడినట్లు చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తనకు సిబ్బందితో పాటు పలువురు సాయంగా నిలిచారు. కొందరికి అలాంటి సహాయం అందక పోవడంతో మృతి చెందుతున్నారని, వారందరి కోసం తాను అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఫాతిమా పేర్కొంది.
