Begin typing your search above and press return to search.

ఏమైందీ.. ఈ తండ్రీ కొడుకులిద్దరికీ.. ఫుల్ ట్రోల్స్​

ఫైనల్​గా భోళాశంకర్​ సినిమాతో కొడుకు విమర్శలను ఎదుర్కోగా' ఇప్పుడు'బెదురులంక 2012'తో తండ్రి క్రిటిక్స్​ను ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Aug 2023 9:21 AM GMT
ఏమైందీ.. ఈ తండ్రీ కొడుకులిద్దరికీ.. ఫుల్ ట్రోల్స్​
X

సంగీతమే ఆయన సామ్రాజ్యం. స్వరాలే ఆయన అస్త్రాలు. ఆయన స్వరాలు' సంగీతం అందించిన సినిమాలు ఒకప్పుడు కలెక్షన్లు కురిపించాయి. తెలుగు చిత్రపరిశ్రమను ఓ ఊపు ఊపేశాయి. తన సంగీతంతో ఆయన ప్రేక్షకుల హృదయాలను శాసించారు. ఆయనే మెలోడీ బ్రహ్మ మణిశర్మ. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఆయనతో కలిసి పనిచేసేవారు. అలాంటి మణిశర్మ ఇప్పుడు చిత్రసీమలో వెనుకబడి పోయారనే చెప్పాలి. ఇప్పుడాయన కొడుకు మహతి స్వర సాగర్ కూడా సంగీత దర్శకుడిగా మారీ బిజీ అవుతున్నారు. బడా హీరోల సినిమాలను కూడా హ్యాండిల్ చేస్తున్నారు. కానీ ఈయన కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. దీంతో ఇప్పుడీ తండ్రీ కొడుకులిద్దరిపై ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి.

మణిశర్మ సంగీతం అందించిన 'ఫ్యాష‌న్ డిజైన‌ర్'అమీతుమీ'' 'లై'శ‌మంత‌క‌మ‌ణి'దేవదాస్' లాంటి సినిమాలు శ్రోతలను ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఆ తర్వాత 2019లో విడుదలైన'ఇస్మార్ట్ శంకర్'తో మళ్లీ ఫామ్​లోకి వచ్చాయి. తనపై వస్తున్న విమర్శలకు ఫుల్​ స్టాప్ పెట్టారు. కానీ ఆ తర్వాత మళ్లీ వెంకటేశ్​'నారప్ప'' చిరంజీవి'ఆచార్య' సినిమాలు మళ్లీ అలరించలేకపోయాయి.

'శాకుంతలం' పరిస్థితి కూడా అదే అయింది. ఇక ఇప్పుడు తాజాగా విడుదలైన'బెదురులంక 2012' సంగీతం కూడా ఆడియెన్స్​ను అలరించలేదని తెలుస్తోంది. బ్యాక్​గ్రౌండ్ స్కోర్‌ అస్సలు బాగాలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ ఉన్న థియేటర్లలోనూ కూడా మణిశర్మ సంగీతం ఆకట్టుకోలేదని అంటున్నారు.

ఇక మణిశర్మ కొడుకు మహతి సాగర్ కూడా రీసెంట్​గా మెగాస్టార్ చిరంజీవి'భోళా శంకర్' చిత్రానికి సంగీతం అందించారు. ఇది చిరు పాత్రను ఎలివేట్​ చేయలేకపోయింది. సినిమాకు ఈయన మ్యూజిక్కే పెద్ద మైనస్​ అయింది. సోషల్​మీడియాలో ఫుల్ ట్రోల్స్ వచ్చాయి. ఈ సినిమాకు ముందు'భీష్మ' 'ఛలో'మాచెర్ల నియోజకవర్గం' చిత్రాలకు మ్యూజిక్ అందించారు. ఇవి పర్వాలేదనిపించాయి.

ఫైనల్​గా భోళాశంకర్​ సినిమాతో కొడుకు విమర్శలను ఎదుర్కోగా' ఇప్పుడు'బెదురులంక 2012'తో తండ్రి క్రిటిక్స్​ను ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్ మెలోడీ బ్రహ్మగా గుర్తింపు పొందిన మణిశర్మ' ఆయన కొడుకు మహతి స్వరసాగర్​.. సంగీతం ఎందుకిలా ఆకట్టుకోలేకపోతున్నాయి? అసలు వీరికి ఏమైంది? అంటూ తెగ చర్చించుకుంటున్నారు. చూడాలి రాబోయే సినిమాలకు వీరు ఎలా అందిస్తారో' తిరిగి ఫామ్​లోకి వస్తారో లేదో చూడాలి..